News May 11, 2024
TSRTC: ఆ ఉద్యోగులు టీషర్ట్, జీన్స్ వేసుకోవద్దు!

TG: ఆర్టీసీ ఉద్యోగులు డ్యూటీలో జీన్స్, టీ షర్టులు వేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫామ్ ధరిస్తున్నారు. మిగతా ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేకపోవడంతో క్యాజువల్స్లోనే కార్పొరేషన్, డిపోలకు వస్తున్నారు. ఈక్రమంలో అందరూ డిగ్నిటీగా ఉండేందుకు ఫార్మల్స్, యూనిఫామ్లో రావాలని ఎండీ సూచించారు.
Similar News
News November 22, 2025
భద్రాద్రి డీసీసీ అధ్యక్షురాలిగా తోట దేవి ప్రసన్న

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తోట దేవి ప్రసన్నను నియమించారు. పలువురు నూతన డీసీసీగా నియామకమైనందుకు శుభాకాంక్షలు తెలిపారు.
News November 22, 2025
వాస్తు ప్రకారం ఇంటికి ఏ రంగు ఉండాలి?

ఇంటికి లేత రంగులు (తెలుపు, లేత పసుపు) శ్రేయస్కరమని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇవి ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని, చల్లదనాన్ని ఇస్తాయని తెలుపుతున్నారు. ‘చిన్న గదులు లేత రంగుల వలన విశాలంగా కనిపిస్తాయి. ఈ రంగులు సానుకూలతను, మానసిక ప్రశాంతతను పెంచుతాయి. రంగుల ఎంపికలో సౌలభ్యం, ఆనందకరమైన అనుభూతికి ప్రాధాన్యం ఇవ్వాలి. పెద్ద గదులకు డార్క్ రంగులైనా పర్లేదు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 22, 2025
బీసీలను ప్రభుత్వం నట్టేట ముంచింది: R.కృష్ణయ్య

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి చివరికి ప్రభుత్వం నట్టేట ముంచిందని ఎంపీ R.కృష్ణయ్య మండిపడ్డారు. రిజర్వేషన్లపై సర్కార్ ఇవాళ జారీ చేసిన జీవో 46ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సూచించినట్లుగా ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేయకుండా, గదుల్లో కూర్చొని నివేదికలు సిద్ధం చేయడం బీసీలను రాజకీయంగా దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు.


