News January 9, 2025

TTD ఛైర్మన్ రాజీనామా చేయాలి: రామచంద్ర యాదవ్

image

AP: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతిచెందడం పట్ల భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ TTD ఛైర్మన్ BR నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో TTD అధికారులు విఫలం అయ్యారని ఆయన ఆరోపించారు. వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే రోజులన్నీ మరింత అప్రమత్తంగా ఉండి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News January 24, 2025

హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి విడాకులు?

image

సోషల్ మీడియాలో భాగస్వామి ఫొటోలను డిలీట్ చేయడం సెలబ్రిటీల విడాకులకు హింట్‌గా నెటిజన్లు భావిస్తున్నారు. తాజాగా హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి ఆ విధంగానే వార్తల్లో నిలిచారు. ఆమె తన భర్త వికాస్ వాసుతో దిగిన ఫొటోలను SM నుంచి తొలగించారు. దీంతో భర్తతో స్వాతి విడాకులు తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ ప్రమోషన్స్ సమయంలోనూ ఇలాంటి రూమర్సే రాగా స్పందించేందుకు స్వాతి నిరాకరించారు.

News January 24, 2025

Stock Markets: బ్యాంకు, ఫార్మా, మీడియా, హెల్త్‌కేర్ షేర్లు డౌన్

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు రేంజుబౌండ్లో కొనసాగుతున్నాయి. ఉదయం మోస్తరు లాభాల్లో మొదలైన బెంచ్‌మార్క్ సూచీలు ప్రస్తుతం ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 23,208 (+2), సెన్సెక్స్ 76,533 (+13) వద్ద చలిస్తున్నాయి. IT, మెటల్, రియాల్టి, O&G షేర్లు పుంజుకున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఆటో, ఫార్మా, మీడియా, హెల్త్‌కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. పవర్‌గ్రిడ్, JSW స్టీల్, BPCL, NTPC, టాటా స్టీల్ టాప్ గెయినర్స్.

News January 24, 2025

రూ.10 లక్షల వరకు నో IT?

image

నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జె‌ట్‌లో వేతన జీవులకు భారీ ఊరట దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. వార్షికాదాయం రూ.10లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, రూ.15లక్షల- రూ.20లక్షల ఆదాయం వరకు కొత్తగా 25% పన్ను శ్లాబ్‌ను తేవాలని భావిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రూ.15లక్షల పైబడిన ఆదాయానికి 30% పన్ను విధిస్తున్న విషయం తెలిసిందే.