News February 14, 2026
TU: పూణే ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లో టీయూ విద్యార్థులు

పూణేలోని సావిత్రిబాయి విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లో టీయూ విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి ప్రశంసలు పొందారు. యోగా, మెడిటేషన్‌తో ప్రారంభమైన జాతీయస్థాయి క్యాంపులో మానసిక అవగాహన, వ్యసన వ్యతిరేక ప్రచారం, సంప్రదాయ క్రీడలు, బతుకమ్మ పండుగ తదితర అంశాలపై చక్కని ప్రదర్శన ఇవ్వడం పట్ల విద్యార్థుల ప్రతిభను ప్రశంసించినట్లు టీయూ కోఆర్డినేటర్ అపర్ణ తెలిపారు.
Similar News
News April 16, 2026
పిల్లలు బడిలో చేరాలి: తిరుపతి కలెక్టర్

బడి ఈడు పిల్లలందరినీ తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించి, డ్రాప్‌అవుట్ లేకుండా చూడాలని తిరుపతి కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతి ఎస్వీయూలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో టీచర్లకు పలు సూచనలు చేశారు. బాధ్యతగా పనిచేసి ప్రభుత్వ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్ శాతం పెంచాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పారు. డీఈవో కేవీఎన్ కుమార్ పాల్గొన్నారు.
News April 16, 2026
అనకాపల్లి: విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలి

విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో ఇంటర్ ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఫెయిల్ అయిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తక్కువ ఉత్తీర్ణత నమోదైన కళాశాలల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న నేపాథ్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.
News April 16, 2026
అల్లూరి: తండ్రి ఆటో డ్రైవర్.. కుమారుడు జిల్లా టాపర్

ఎటపాక మండలం గన్నవరం గ్రామానికి చెందిన జయరామకృష్ణ CBSE పదోతరగతి పరీక్షా ఫలితాల్లో 500/478 సాధించి ఉమ్మడి అల్లూరి జిల్లాకు టాపర్‌గా నిలిచాడని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య తెలిపారు. జయరామకృష్ణ చింతూరు ఏకలవ్య పాఠశాలలో చదువుతున్నాడు. తండ్రి పరమయ్య ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తమ కుమారుడు జిల్లా టాపర్‌గా రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.


