News March 19, 2024
ఆరోజు రాత్రి గంటపాటు లైట్లు ఆర్పండి
ఈనెల 23న దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహించనున్నారు. ఆరోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఎర్త్ అవర్‌లో భాగంగా గంటపాటు అందరూ లైట్లు ఆఫ్ చేయాలని పర్యావరణ శాఖ కోరింది. వాతావరణంలో మార్పులు, జీవవైవిధ్యానికి జరుగుతున్న నష్టాన్ని కొంతైనా తగ్గించేందుకు ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. కాగా ఏటా ఒకసారి దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు.
Similar News
News September 9, 2024
గోదావరికి భారీగా వరద వచ్చే అవకాశం!
ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. గోదావరి ఉపనది ప్రాణహితకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. అలాగే ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నీరంతా ఒకటి, రెండు రోజుల్లో గోదావరికి చేరనుంది. అటు ఉత్తరాంధ్రలోని వంశధార, నాగావళి నదులకు సైతం ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
News September 9, 2024
విజయ్ కొడుకు డైరెక్షన్లో సందీప్ కిషన్?
తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్‌తో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జేసన్‌కు డైరెక్టర్‌గా ఇది తొలి సినిమా కావడం గమనార్హం. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News September 9, 2024
ప్రకాశం బ్యారేజ్ బోట్ల కేసు.. నిందితుడు లోకేశ్ సన్నిహితుడే: వైసీపీ
AP: వరదల్లో ప్రకాశం బ్యారేజ్ వద్దకు బోట్లు కొట్టుకొచ్చిన కేసు నిందితుడు మంత్రి లోకేశ్ సన్నిహితుడేనని YCP ఆరోపించింది. ‘ఈ కేసులో కోమటి రామ్మోహన్, ఉషాద్రిలను CBN ఆదేశాలతో పోలీసులు అరెస్టు చేశారు. రామ్మోహన్ TDP ఎన్నారై విభాగం అధ్యక్షుడు కోమటి జయరాంకు బంధువు. ఉషాద్రికి లోకేశ్‌తో సంబంధాలున్నాయనే దానికి ఈ ఫొటోనే సాక్ష్యం. వరద బాధితుల కోపాన్ని డైవర్ట్ చేయడానికి TDP ప్రయత్నిస్తోంది’ అని ట్వీట్ చేసింది.