News April 19, 2024
ఓటింగ్ శాతం @5pm
★ అరుణాచల్‌ప్రదేశ్: 63.97%
★ అస్సాం: 70.77%
★ బిహార్: 46.32
★ ఛత్తీస్‌గఢ్: 63.41
★ మధ్యప్రదేశ్: 63.25
★ మణిపుర్: 68.62
★ రాజస్థాన్: 50.27
★ తమిళనాడు: 62.08
★ పశ్చిమబెంగాల్: 77.57
★ మహారాష్ట్ర: 54.85
Similar News
News November 19, 2024
ACA ఉమెన్స్ క్రికెట్ ఆపరేషన్స్ మెంటార్‌గా మిథాలీ
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో మహిళల క్రికెట్ ఆపరేషన్స్ మెంటార్‌గా భారత మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ నియమితులయ్యారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి, వారిని ఉత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు ఆమె ACAతో కలిసి మూడేళ్లు పని చేయనున్నారు. అనంతపురంలో హై-పెర్ఫార్మెన్స్ అకాడమీని ఏర్పాటు చేసి, 80 మంది బాలికలను ఎంపిక చేసి 365 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ACA తెలిపింది.
News November 19, 2024
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షపై ఆ నిర్ణయం వెనక్కి!
JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష విధానంపై జాయింట్ అడ్మిషన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. 2025 నుంచి ఈ పరీక్షను వరుసగా మూడుసార్లు రాసుకోవచ్చని ఇటీవల ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. గతంలోలా వరుసగా రెండు సార్లు మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఇంటర్ పాసైన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాది మాత్రమే ఈ ఎగ్జామ్ రాయవచ్చు. IITల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీ కోసం దీనిని నిర్వహిస్తారు.
News November 19, 2024
నేడు వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన
TG: ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వరంగల్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహిస్తోంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే ఈ సభలో CM రేవంత్ పాల్గొననున్నారు. ఇవాళ ఇందిరా గాంధీ జయంతి నేపథ్యంలో సభా వేదికకు ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’గా పేరు పెట్టారు. ఈ సభకు దాదాపు లక్ష మంది హాజరవుతారని అంచనా. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.