News April 12, 2024

కవలలు.. టెన్త్, ఇంటర్‌లో సమాన మార్కులు

image

కర్ణాటకలోని హసన్‌కు చెందిన కవల అమ్మాయిలు చుక్కి, ఇబ్బనిచంద్ర తాజాగా విడుదలైన ఇంటర్(PUC) ఫలితాల్లో సమాన మార్కులు సాధించారు. వీరికి 600 మార్కులకుగానూ 571 మార్కులు వచ్చాయి. విశేషం ఏమిటంటే రెండేళ్ల కిందట పదో తరగతి ఫలితాల్లో ఈ కవలలిద్దరికీ 625 మార్కులకు 620 మార్కులొచ్చాయి. ఇది పూర్తిగా యాదృచ్ఛికమని, సమాన మార్కులు ఎలా వచ్చాయో తమకే అర్థంకావడం లేదని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Similar News

News January 14, 2026

త్వరలో రాష్ట్రంలో 10వేల పోస్టులకు నోటిఫికేషన్!

image

TG: రాష్ట్రంలో త్వరలో వైద్యారోగ్యశాఖలో 10వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇప్పటికే సీఎం రేవంత్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.

News January 14, 2026

సింగపూర్ పాస్‌పోర్ట్ నం.1..! మన స్థానం ఎంత..?

image

మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ లిస్ట్-2026లో ఇండియా 80వ స్థానంలో(2025లో 85) నిలిచింది. మన PPతో వీసా లేకుండా 55 దేశాలకు వెళ్లొచ్చని హెన్లీ ఇండెక్స్ తెలిపింది. 192 కంట్రీస్ యాక్సెస్‌తో సింగపూర్ No.1.. 188 యాక్సెస్‌తో జపాన్, సౌత్ కొరియా No.2 ప్లేసెస్‌లో ఉన్నాయి. డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్, స్పెయిన్, లగ్జెంబర్గ్ 3లో నిలిచాయి. లిస్ట్‌లో USA 10, PAK 98ర్యాంకు పొందగా, AFG 101తో చివరన ఉంది.

News January 14, 2026

‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ&రేటింగ్

image

డబ్బు కోసం జమిందారీ అమ్మాయితో పెళ్లి, ప్రెసిడెంట్ కావడం, ఆ తర్వాత హీరోకు ఎదురయ్యే అనుభవాలే స్టోరీలైన్. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్, వన్ లైన్ పంచ్‌లతో మరోసారి అలరించారు. హీరోయిన్ మీనాక్షి నటన, అందంతో ఆకట్టుకున్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. పాత స్టోరీ లైన్, యావరేజ్ మ్యూజిక్ మైనస్. సెకండాఫ్‌లో వచ్చే పొలిటికల్ డ్రామా ల్యాగ్ అన్పిస్తుంది. ఓవరాల్‌గా కామెడీ ట్రావెల్.
రేటింగ్: 2.75/5.