News November 9, 2024
ఐదేళ్లలో రెండే సెంచరీలా?: పాంటింగ్

టెస్టుల్లో టీమ్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో రెండే సెంచరీలు చేశారని గుర్తుచేశారు. ‘2019 నవంబరు తర్వాత విరాట్ కేవలం రెండే టెస్టు సెంచరీలు చేశారు. అది కచ్చితంగా ఆందోళనకరమే. ఇంకెవరైనా ఆటగాడయ్యుంటే అంతర్జాతీయ క్రికెట్ జట్టు దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. AUS పర్యటనలో ఆయన పుంజుకోవాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
హనుమాన్ చాలీసా భావం – 19

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥
సూర్యుడిని పండుగా భావించి ఆకాశంలో ఎగిరిన బలవంతుడు హనుమ. అలాంటిది శ్రీరాముని ఉంగరంతో సముద్రాన్ని దాటడం ఆశ్చర్యాన్ని కలిగించదు. హనుమంతుని అద్భుత శక్తులు తెలిసిన తర్వాత సముద్ర లంఘనం ఆయనకు ఎంతో సులువు అని కవి ఉద్దేశం. దైవకార్య సాధనలో ఎంత కష్టమైన పనైనా సునాయసంగా పూర్తవుతుందనే సందేశం ఈ దోహా ఇస్తోంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 24, 2025
INDSETIలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు

ఇండియన్ బ్యాంక్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ <
News November 24, 2025
ఇలా అయితే టార్గెట్ రీచ్ అవ్వడం మరింత ఆలస్యం

డాలర్తో రూపాయి విలువ క్రమంగా పడిపోతుండటంతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ఇండియాకు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘2024లో $1కి రూ.82లు సమానం ఉండగా, ప్రస్తుతం సుమారు రూ. 90కి చేరింది. రూపాయి బలహీనపడటం వల్ల డాలర్లలో లెక్కించిన భారత GDP విలువ తగ్గి, ఈ లక్ష్యం నెరవేరడం ఆలస్యం అవుతుంది’ అని చెబుతున్నారు.


