News November 9, 2024
ఐదేళ్లలో రెండే సెంచరీలా?: పాంటింగ్
టెస్టుల్లో టీమ్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో రెండే సెంచరీలు చేశారని గుర్తుచేశారు. ‘2019 నవంబరు తర్వాత విరాట్ కేవలం రెండే టెస్టు సెంచరీలు చేశారు. అది కచ్చితంగా ఆందోళనకరమే. ఇంకెవరైనా ఆటగాడయ్యుంటే అంతర్జాతీయ క్రికెట్ జట్టు దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. AUS పర్యటనలో ఆయన పుంజుకోవాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News December 3, 2024
మహిళా వర్సిటీ బిల్లుపై త్వరలో చట్టం?
TG: మహిళా వర్సిటీ అని చెప్పి OU పేరుతో సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఇటీవల విద్యార్థినులు నిరసన చేపట్టారు. దీంతో చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. BRS హయాంలోనే కోఠి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీ చేస్తున్నట్లు GO జారీ చేసినా చట్టం కాలేదు. చట్టం చేసి UGC నుంచి ఆమోదం పొందితేనే వర్సిటీ పేరిట ధ్రువపత్రాలు ఇచ్చేందుకు వీలవుతుంది.
News December 3, 2024
ఆ విషయంలో ‘గేమ్ ఛేంజర్’ రికార్డు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా 2025 జనవరి 10న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో అమెరికాలోని డల్లాస్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. తాజాగా వేదిక వివరాలను మేకర్స్ వెల్లడించారు. ఈనెల 21న సాయంత్రం 6 గంటలకు Curtis Culwell Cente, గార్లాండ్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఓ ఇండియన్ సినిమా USAలో ప్రీరిలీజ్ అవ్వడం ఇదే తొలిసారని మేకర్స్ వెల్లడించారు.
News December 3, 2024
7 IPOలకు సెబీ గ్రీన్ సిగ్నల్.. విలువ రూ.12,000 కోట్లు
మరో ఏడు కంపెనీల IPOలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఈకామ్, స్మార్ట్‌వర్క్ కోవర్కింగ్ స్పేసెస్, ట్రూఆల్ట్, జెమాలాజికల్, కెరారో, కాంకర్డ్, వెంటివ్ హాస్పిటాలిటీ ఉన్నాయి. IPOల ద్వారా సంస్థలు దాదాపు రూ.12,000 కోట్లు సమీకరించనున్నాయి. జెమాలాజికల్ అత్యధికంగా రూ.4వేల కోట్లు సమీకరించనుంది. మరోవైపు 2025లో జెప్టో పబ్లిక్ ఇష్యూకు వీలున్నట్లు కంపెనీ కో ఫౌండర్ ఆదిత్ పాలిచా వెల్లడించారు.