News April 29, 2024
వడదెబ్బకు ఇద్దరు మృతి.. ఇవాళ, రేపు ఎండలు మరింత తీవ్రం

TG: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. నిన్న ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో వడదెబ్బతో ఇద్దరు మరణించారు. మరోవైపు ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో వర్షం పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.
Similar News
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.
News November 24, 2025
118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

<
News November 24, 2025
AP న్యూస్ రౌండప్

* నెల్లూరు(D)లో గ్రీన్ఫీల్డ్ ఫైబర్ సిమెంట్ ప్లాంటు ఏర్పాటుచేయనున్నట్లు ‘బిర్లాన్యూ’ వెల్లడించింది. తొలి దశలో ₹127Cr వెచ్చిస్తామని, 600 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది.
* పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు PPP విధానాన్ని అనుసరిస్తున్నట్లు మున్సిపల్ శాఖ తెలిపింది. 2029 నాటికి ₹66000Cr పెట్టుబడులు సమీకరిస్తామంది.
* తిరుపతిలో ప్రత్యేకంగా సంస్కృత అకాడమీ ఏర్పాటు: తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్ విల్సన్


