News November 25, 2024

వచ్చే నెలలో రెండు ఇస్రో ప్రయోగాలు

image

డిసెంబర్ నెలలో షార్ నుంచి ఇస్రో రెండు ప్రయోగాలను చేపట్టనుంది. 4వ తేదీన PSLV C59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా-3 అనే శాటిలైట్‌తో పాటు మరో 4 చిన్నతరహా ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించనుంది. 24వ తేదీన PSLV C60 ద్వారా రిశాట్-1B సహా నాలుగు వాణిజ్యపరమైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు సైంటిస్టులు సన్నాహాలు చేస్తున్నారు.

Similar News

News November 25, 2024

1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అంటే ఎన్ని లీటర్లో తెలుసా?

image

అంతర్జాతీయంగా ముడి చమురు (క్రూడ్ ఆయిల్)ను బ్యారెళ్లలో కొలుస్తారు. ఒక బ్యారెల్ ఆయిల్ 158.9 లీటర్లతో సమానం. ముడి చమురును రిఫైనరీల్లో శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, కిరోసిన్, LPG, లూబ్రికెంట్స్ ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు రూ.6వేలు ఉంది. దీని ప్రకారం పెట్రోల్ రేటు రూ.37 వరకు ఉండాలి. కానీ రిఫైన్, రవాణా ఛార్జీలు, పన్నులు, కమీషన్లతో రేటు రూ.110గా ఉంది.

News November 25, 2024

డిసెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు

image

AP: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా DEC 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామ, మండల స్థాయిలో సభల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి 45 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనుంది. వీటి పర్యవేక్షణకు ఓ సీనియర్ ఐఏఎస్‌ను ప్రతి జిల్లాకు నోడల్ అధికారిగా నియమించనుంది. భూఆక్రమణలు, సరిహద్దు వివాదాలు, మ్యుటేషన్లు, రికార్డుల్లో మార్పులు లాంటి సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించనుంది.

News November 25, 2024

IPL: మ్యాజిక్ మ్యాన్.. భలే ఎత్తుగడలు!

image

ఇతర ఫ్రాంఛైజీల పర్స్ మనీని ఖాళీ చేయడంలో కిరణ్ కుమార్ గ్రంధి దిట్ట. GMR గ్రూప్స్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు కుమారుడైన కిరణ్ ప్రస్తుతం DC కో-ఓనర్‌గా ఉన్నారు. నిన్న పంత్‌ను లక్నో రూ.21 కోట్లకు కొనేందుకు సిద్ధమవ్వగా కిరణ్ కుమార్ RTMతో భయపెట్టి ఆ రేటును పెంచేలా చేశారు. ఫలితంగా పంత్ కోసం లక్నో రూ.27 కోట్లు పెట్టాల్సి వచ్చింది. అలాగే స్టార్ బౌలర్ స్టార్క్‌ను రూ.11.75 కోట్లకే దక్కించుకున్నారు.