News January 24, 2025

పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. ట్విస్ట్ ఏంటంటే?

image

UPలో కవిత, గుంజా అనే ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. భర్తలు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక వారి నుంచి విడిపోయి ఇలా ఒక్కటయ్యారు. గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన వీరిద్దరికి 4ఏళ్ల క్రితం ఇన్‌స్టాలో పరిచయమైంది. కొన్ని నెలలుగా ఒకే గదిలో ఉంటున్నారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేమని తెలుసుకుని తాజాగా ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. గుంజా తన పేరును బబ్లూగా మార్చుకుని తనకు భర్తగా ఉంటుందని కవిత తెలిపింది.

Similar News

News February 11, 2025

మంచి మాట – పద్యబాట

image

నిండు నదులు పాఱు నిల్చి గంభీరమై
వెర్రివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం: గొప్ప నదులు నిదానంగా, గంభీరంగా ప్రవహిస్తాయి. పిల్లవాగులు అతివేగంగా గట్లుదాటి పొర్లి ప్రవహిస్తాయి. అట్లే యోగ్యుడు నిదానంగా, గంభీరంగా మాట్లాడతాడు. నీచుడు బడ బడ వాగుతూ ఉంటాడు.

News February 11, 2025

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్ 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. అయితే వెబ్‌సైట్‌లో ఎర్రర్ వస్తోందని, రిజల్ట్స్ చూపించడం లేదని పలువురు అభ్యర్థులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 22 నుంచి 29 వరకు ఈ పరీక్షను నిర్వహించారు. ఫైనల్ ఆన్సర్ కీ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 11, 2025

AP కాస్ట్ సర్టిఫికెట్లు తెలంగాణలో చెల్లవు: హైకోర్టు

image

ఏపీ ప్రభుత్వం జారీ చేసే ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలతో తెలంగాణలో రిజర్వేషన్లు పొందలేరని TG హైకోర్టు స్పష్టం చేసింది. పీజీ మెడికల్ సీట్లలో రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను విచారించింది. TG ప్రభుత్వం జారీ చేసిన SC సర్టిఫికెట్ ఉన్న వాళ్లే ఇక్కడ రిజర్వేషన్‌కు అర్హులని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం AP SC కాస్ట్ సర్టిఫికెట్ పత్రం TGలో చెల్లదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో CJ ధర్మాసనం ఏకీభవించింది.

error: Content is protected !!