News August 22, 2024

ఏపీ హైకోర్టుకు మరో ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు

image

AP: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. వీరు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జస్టిస్ జోతిర్మయి(తెనాలి) 2008లో జిల్లా జడ్జిగా ఎంపికై అంచెలంచెలుగా ఎదిగారు. జస్టిస్ గోపాలకృష్ణారావు(కృష్ణా-D చల్లపల్లి) 1994 నుంచి పలు హోదాల్లో పనిచేస్తూ హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.

Similar News

News September 8, 2024

ఎమ్మెల్యేల అనర్హతపై రేపు హైకోర్టు తీర్పు

image

TG: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు రేపు నిర్ణయం వెల్లడించనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు సహా పలువురిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News September 8, 2024

ఓకే తాలూకాలో 12 మంది మృతి.. అంతుబట్టని జ్వరమే కారణం!

image

గుజరాత్‌ కచ్ జిల్లాలోని లఖ్‌పత్ తాలూకాలో ఇటీవల 12 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపింది. భారీ వ‌ర్షాల త‌రువాత బాధితులకు వచ్చిన తీవ్ర‌మైన జ్వ‌రాన్ని వైద్యులు క‌చ్చితంగా అంచనా వేయలేకపోయారని, శ్వాస తీసుకోవ‌డంలో కూడా ఇబ్బందులు ప‌డ్డారని స్థానికులు చెబుతున్నారు. పాక్ స‌రిహ‌ద్దులో ఉండే ఈ తాలూకాలో స‌మ‌స్య‌ పరిష్కారానికి 22 వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. న్యుమోనైటిస్‌గా భావిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.

News September 8, 2024

నా జీవితంలో రెండు బ్రేకప్స్ ఉన్నాయి: తమన్నా

image

టీనేజ్‌లో ఓ వ్యక్తిని ప్రేమించానని, అయితే అతని కోసం నచ్చిన జీవితాన్ని వదులుకోవడం ఇష్టం లేక విడిపోయినట్లు హీరోయిన్ తమన్నా తెలిపారు. ఆ తర్వాత రిలేషన్‌లో ఉన్న వ్యక్తి ప్రతిచిన్న విషయానికీ అబద్ధం చెప్పడం సహించలేకపోయానని చెప్పారు. అలాంటి వ్యక్తితో బంధాన్ని కొనసాగించడం ప్రమాదమని అర్థమై, అలా ఆ లవ్ స్టోరీ కూడా ముగిసిపోయిందన్నారు. ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో ఈ అమ్మడు రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే.