News January 31, 2025

సరిహద్దులో ఎదురుకాల్పులు.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

image

J&Kలో పెద్దఎత్తున చొరబాట్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. పూంఛ్ సెక్టార్‌లోని సరిహద్దు నియంత్రణ రేఖ నుంచి మన దేశంలోకి చొరబడేందుకు నిన్న రాత్రి టెర్రరిస్టులు కుట్ర పన్నారు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు కాల్పులు ప్రారంభించాయి. రాత్రంతా భారీ స్థాయిలో ఎదురుకాల్పులు కొనసాగాయి. ఇందులో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. పెద్దఎత్తున ఆయుధాలు సీజ్ చేశారు.

Similar News

News February 9, 2025

ఇందిరమ్మ ఇళ్లు.. వారి ఖాతాల్లోకి రూ.లక్ష?

image

TG: ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడతలో 4.5L మందిని ఎంపిక చేస్తారని, లబ్ధిదారుల జాబితాను ఇన్‌ఛార్జ్ మంత్రులు ఫైనల్ చేయగానే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలుస్తోంది. ఫస్ట్ ఫేజ్‌లో లబ్ధిదారులకు ₹లక్ష చొప్పున జమవుతాయని సమాచారం. దీనిపై సర్కార్ ప్రకటన చేయాల్సి ఉంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

News February 9, 2025

అత్యాశ.. ఉన్నదీ పోయింది!

image

కేంద్రంలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించాలన్న అత్యాశే ఆప్ కొంప ముంచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 3 సార్లు ఢిల్లీ ప్రజలు అధికారం ఇవ్వడం, ఆ తర్వాత పంజాబ్‌లోనూ పాగా వేయడంతో చక్రం తిప్పాలని కేజ్రీవాల్ భావించారు. ‘ఇండియా’ కూటమి నుంచి దూరమై నేరుగా మోదీపైనే విమర్శలు చేస్తూ దేశప్రజల దృష్టిని ఆకర్షించాలని చూశారు. ఈక్రమంలోనే అవినీతి ఆరోపణల కేసులు, ఢిల్లీలో పాలన గాడి తప్పడంతో ప్రజలు ఓటుతో ఊడ్చేశారు.

News February 9, 2025

వేడి వాతావరణం.. పెరగనున్న ఉష్ణోగ్రతలు

image

AP: వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొందని, నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా రికార్డయినట్లు తెలిపింది. నందిగామలో వరుసగా ఐదో రోజు అత్యధికంగా 37.6 డిగ్రీలు నమోదైంది.

error: Content is protected !!