News May 24, 2024

ఒకే ప్లాట్‌ఫామ్‌పై రెండు రైళ్లు!

image

AP: వైజాగ్‌ రైల్వే స్టేషన్‌లో వింత పరిస్థితి నెలకొంది. ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఒకే సమయంలో 2 రైళ్లు ఒకదాని వెనక మరొకటి నిలుస్తున్నాయి. దీంతో ఆ రైళ్లలో ప్రయాణించాల్సిన ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. విశాఖ-భువనేశ్వర్ ఇంటర్ సిటీ, విశాఖ-దుర్గ్ రైలు బోగీలను ఒకదాని వెనుక ఒకటి నిలుపుతున్నారు. చాలా మంది కనిపిస్తున్న బోగిల్లోకి ఎక్కేస్తున్నారు. మళ్లీ తాము ఎక్కాల్సిన రైలు ఇది కాదని దిగుతున్నారు.

Similar News

News February 16, 2025

దారుణం.. భర్త ఎదుటే భార్యపై అత్యాచారం

image

TG: సంగారెడ్డి(D) ఫసల్‌వాదిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని ఓ తండాకు చెందిన దంపతులు సేవాలాల్ జయంతి సందర్భంగా ఈ నెల 2న అనంతపురం జిల్లాకు కాలినడకన వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఫసల్‌వాదిలోని ఓ విద్యాపీఠంలో భోజనం చేసి చెట్టు కింద నిద్రపోయారు. పెయింటింగ్ పనులు చేసే మాథవన్ (34) భర్తను ఘోరంగా కొట్టి సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేశారు.

News February 16, 2025

రంజీ ట్రోఫీ నుంచి జైస్వాల్ ఔట్?

image

టీమ్ ఇండియా ప్లేయర్ యశస్వీ జైస్వాల్ రంజీ సెమీస్ మ్యాచ్ ఆడటం లేదని తెలుస్తోంది. కాలి మడమ నొప్పి కారణంగా ఆయన ఈ మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 17 నుంచి విదర్భతో జరగనున్న సెమీ ఫైనల్ కోసం ముంబై సెలక్టర్లు జైస్వాల్‌ను ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఆయన గాయపడడం ముంబైకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే భారత జట్టులోనూ జైస్వాల్ చోటు దక్కించుకోలేదు.

News February 16, 2025

మహారాష్ట్రలో లవ్ జిహాద్ నియంత్రణకు చట్టం!

image

బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్ నియంత్రణ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకు ఏడుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. DGP అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో న్యాయ, శిశు, మైనార్టీ, సామాజిక శాఖల సెక్రటరీలు, హోంశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. లవ్ జిహాద్‌ను అరికట్టడానికి ఏం చేయాలన్నదానిపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

error: Content is protected !!