News September 20, 2024
ఆ రెండు రోజుల్లో తిరుమల ఘాట్ రోడ్లలో టూవీలర్స్ నిషేధం
AP: అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు TTD వెల్లడించింది. 8న గరుడ సేవ నేపథ్యంలో 7వ తేదీ రాత్రి 9 నుంచి 9న ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో టూవీలర్స్ రాకపోకలను నిషేధించినట్లు తెలిపింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News October 7, 2024
గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ ఆందోళన
INDvBAN టీ20 మ్యాచ్ జరిగిన గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ కార్యకర్తలు నల్ల జెండాలతో ఆందోళన చేశారు. బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతుంటే, ఆ దేశంతో క్రికెట్ ఆడటమేంటంటూ నినాదాలు చేశారు. మ్యాచ్ దృష్ట్యా ఎటువంటి నిరసనలు వ్యక్తం చేయరాదంటూ స్థానిక జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు జారీ చేసినప్పటికీ నిరసనకారులు లెక్కచేయకపోవడం గమనార్హం. వారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
News October 7, 2024
రన్నింగ్ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు
TG: గుండెపోటుకు గురైనా ఆర్టీసీ డ్రైవర్ విధి నిర్వహణను మరువలేదు. 45 మంది ప్రాణాలను కాపాడి, ఆయన తనువు చాలించారు. హుజూరాబాద్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తుండగా గజ్వేల్ వద్దకు రాగానే డ్రైవర్ రమేశ్ సింగ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే ఆయన బస్సును సురక్షితంగా పక్కకు నిలిపి, కుప్పకూలిపోయారు. ప్రయాణికులు ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారు.
News October 6, 2024
PHOTOS: ముత్యాల పందిరిలో శ్రీనివాసుడి విహారం
తిరుమల బ్రహ్మోత్సవాలు మూడో రోజు కనులపండువగా సాగాయి. ఇవాళ శ్రీమలయప్పస్వామి ముత్యాల పందిరిపై విహరించారు. శ్రీవారిని దర్శించుకొని భక్తులు తన్మయత్వం పొందారు. తిరుమల గిరులు శ్రీనివాసుడి నామస్మరణతో మార్మోగాయి. వేంకటేశ్వరుడి విహారం సందర్భంగా మాడవీధుల్లో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.