News March 29, 2024

రష్యాలో జర్నలిస్టుకు రెండేళ్ల జైలు.. ఎందుకంటే!

image

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని తీవ్రంగా విమర్శించిన మిఖాయిల్ ఫెల్డ్‌మాన్ అనే జర్నలిస్టుకు రష్యా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన సహా ఐదుగురు పాత్రికేయుల్ని గత 2 రోజుల్లో అధికారులు అరెస్టు చేశారు. వారిలో ఒకరిని తీవ్రంగా కొట్టారని, మరొకరిని జైలుకు తరలించారని పుతిన్ వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. రష్యాలో సర్కారును విమర్శించే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.

Similar News

News April 10, 2026

ఈ స్టార్ ఖాతాలో 4 ₹వెయ్యి కోట్ల సినిమాలు!

image

భారతీయ సినీ చరిత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సరికొత్త రికార్డు నమోదు చేశారు. అత్యధికంగా రూ.వెయ్యి కోట్లు వసూలు చేసిన చిత్రాల్లో నటించిన నటుడిగా నిలిచారు. ఆయన నటించిన KGF 2, జవాన్, ధురంధర్- 1&2 సినిమాలు ఈ మైలురాయిని దాటాయి. షారుఖ్, ప్రభాస్, రణ్‌వీర్‌ వంటి స్టార్ హీరోల కంటే ఎక్కువగా 4 సార్లు భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఆయన నటించడం విశేషం. సంజయ్ దత్ తర్వాత దీపికా పదుకొణె(3) ఉన్నారు.

News April 10, 2026

బయటపడిన పాక్ కపట బుద్ధి.. లక్ష్యమిదే?

image

పాక్ నమ్మదగిన మధ్యవర్తి కాదని ఇజ్రాయెల్ చేసిన <<19605543>>ప్రకటన<<>> ఒక్కరోజులోనే నిజమైంది. దాయాది కపట బుద్ధి బయటపడింది. ఇన్నాళ్లూ ఇరాన్‌పై జరిగిన దాడులను ప్రశ్నించే ధైర్యం చేయలేదు. ఇప్పుడు కాళ్లావేళ్లా పడి ‘మీడియేటర్’ హోదా తెచ్చుకోగానే అగ్రరాజ్యం, భారత్‌కు మిత్రదేశమైన ఇజ్రాయెల్‌పై పాక్ మంత్రి ఖవాజా <<19612683>>విషం కక్కారు<<>>. తద్వారా ఆ దేశాన్ని విలన్‌ను చేసి అమెరికా పంచన చేరాలనేది పాక్ ఉద్దేశంగా కనిపిస్తోంది.

News April 10, 2026

BREAKING: పెరిగిన బంగారం, వెండి ధరలు

image

నిన్న భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,520 పెరిగి రూ.1,53,000కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,400 ఎగబాకి రూ.1,40,250 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలుండొచ్చు.