News March 29, 2024

రష్యాలో జర్నలిస్టుకు రెండేళ్ల జైలు.. ఎందుకంటే!

image

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని తీవ్రంగా విమర్శించిన మిఖాయిల్ ఫెల్డ్‌మాన్ అనే జర్నలిస్టుకు రష్యా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన సహా ఐదుగురు పాత్రికేయుల్ని గత 2 రోజుల్లో అధికారులు అరెస్టు చేశారు. వారిలో ఒకరిని తీవ్రంగా కొట్టారని, మరొకరిని జైలుకు తరలించారని పుతిన్ వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. రష్యాలో సర్కారును విమర్శించే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.

Similar News

News April 17, 2026

గుడికి వెళ్లొచ్చిన తర్వాత కాళ్లుచేతులు కడగకూడదా?

image

గుడికి వెళ్లొచ్చిన వెంటనే కాళ్లు, చేతులు కడగకూడదని పండితులు సూచిస్తున్నారు. అలా కడిగితే గుడిలో లభించిన దైవిక శక్తి, పాజిటివ్ వైబ్రేషన్స్ తొలగిపోతాయంటున్నారు. ‘ప్రదక్షిణల ద్వారా పాదాలు, పూజ ద్వారా శరీరం గ్రహించిన శక్తిని వెంటనే నీటితో కడిగేయకూడదు. కనీసం 15-20 నిమిషాల వరకు వేచి ఉండటం మంచిది. అయితే ఏదైనా తినే ముందు లేదా అపరిశుభ్రంగా అనిపిస్తే చేతులు కడుక్కోవడంలో తప్పు లేదు.

News April 17, 2026

అప్రూవర్‌గా మారుతా.. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

image

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను అప్రూవర్‌గా మారుతానని ఢిల్లీ కోర్టుకు తెలిపారు. దీనిపై EDకి రిక్వెస్ట్ పెట్టమని కోర్టు సూచించింది. కాగా నిందితుడు <<12328864>>సుకేశ్‌<<>> జాక్వెలిన్‌తో గతంలో రిలేషన్‌లో ఉన్నానని చెప్పిన విషయం తెలిసిందే. అధికారినని, బిలియనీర్ శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని ఆయన భార్య నుంచి సుకేశ్ ₹215Cr వసూలు చేయడంతో ఈ కేసు బయటపడింది.

News April 17, 2026

జ్వరంతో ఉన్నప్పుడు పిల్లలకు ఇవి పెట్టకూడదు

image

పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వేయించిన పదార్థాలు, బజ్జీలు, పకోడీలు, చిప్స్ వంటివి పెట్టకూడదు. ఇవి త్వరగా జీర్ణం కావు, కడుపునొప్పి, అజీర్తి కలిగిస్తాయంటున్నారు నిపుణులు. అలాగే చాక్లెట్స్, కేక్, జ్యూస్ వంటి తీపి పదార్థాలు కూడా తగ్గించాలి. షుగర్ ఎక్కువ ఉన్న ఆహారం శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగడానికి, ఇమ్యూనిటీ తగ్గడానికి కారణం అవుతుంది. ప్యాక్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఇవ్వకూడదని చెబుతున్నారు.