News January 31, 2025

U-19 TWC: ఫైనల్ చేరిన సౌతాఫ్రికా

image

అండర్-19 ఉమెన్స్ T20 WCలో ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా షాక్ ఇచ్చింది. సెమీస్‌లో 5 వికెట్లతో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన AUSను ఆ జట్టు 105 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 18.1 ఓవర్లలో టార్గెట్‌ను ఛేజ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న మరో సెమీస్‌లో IND, ENG తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ENG 14 ఓవర్లలో 86/4 చేసింది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో SAను ఢీకొంటుంది.

Similar News

News December 25, 2025

‘శంబాల’ మూవీ రివ్యూ&రేటింగ్

image

ఆకాశం నుంచి ‘శంబాల’ గ్రామంలో ఉల్క పడిన తర్వాత ఏం జరిగిందనేదే కథ. సైన్స్, మూఢనమ్మకాలను లింక్ చేస్తూ థ్రిల్లింగ్ అంశాలతో డైరెక్టర్ యుగంధర్ కథను నడిపించారు. హీరో ఆది సాయికుమార్ నటనతో మెప్పించారు. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. శ్రీచరణ్ మ్యూజిక్ మూవీకి ప్లస్. VFXలో క్వాలిటీ లోపించింది. ఫస్టాఫ్‌ మరింత ఎడిట్ చేయాల్సింది. ఊహకందే కథనం, రొటీన్ క్లైమాక్స్ మైనస్.
రేటింగ్: 2.75/5

News December 25, 2025

3,073పోస్టులు.. ఆన్సర్ కీ విడుదల

image

<>స్టాఫ్<<>> సెలక్షన్ కమిషన్ CAPF, ఢిల్లీ పోస్ట్ విభాగంలో ఎస్సై పోస్టుల భర్తీకి డిసెంబర్ 9 నుంచి 12 వరకు నిర్వహించిన పేపర్ 1 పరీక్షల ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రర్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి షిఫ్ట్‌ల వారీగా ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరం ఉంటే DEC 27వరకు క్వశ్చన్‌కు రూ.50 చెల్లించి తెలుసుకోవచ్చు. SSC 3,073 పోస్టుల భర్తీకి OCT 16వరకు దరఖాస్తులు స్వీకరించింది.

News December 25, 2025

NCERT ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

NCERT 173 గ్రూప్ A, B, C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 27 – జనవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , ITI, డిప్లొమా, డిగ్రీ, PG, B.Tech, M.Tech, MBA, M.Lib.Sc, B.Lib.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.