News January 31, 2025
U-19 TWC: ఫైనల్ చేరిన సౌతాఫ్రికా

అండర్-19 ఉమెన్స్ T20 WCలో ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా షాక్ ఇచ్చింది. సెమీస్‌లో 5 వికెట్లతో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన AUSను ఆ జట్టు 105 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 18.1 ఓవర్లలో టార్గెట్‌ను ఛేజ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న మరో సెమీస్‌లో IND, ENG తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ENG 14 ఓవర్లలో 86/4 చేసింది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో SAను ఢీకొంటుంది.
Similar News
News February 13, 2025
PMAY ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన

AP: PMAY 1.0ను కేంద్రం 2027 వరకు పొడిగించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. PMAY 2.0 సర్వే కొనసాగుతోందని, ఇప్పటివరకు 11,600 మంది లబ్ధిదారులను గుర్తించామని వెల్లడించారు. గతంలో TDP హయాంలో 3.18L మందిని ఎంపిక చేయగా, YCP ఆ జాబితాను మార్చేసి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిందన్నారు. అప్పుడు మిగిలిపోయిన వారికి 2024 ఏప్రిల్ తర్వాత ఇళ్లు మంజూరయ్యాయని, మరో 4.5L ఇళ్లను కేటాయించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
News February 13, 2025
RCB కెప్టెన్‌గా రజత్ పాటిదార్?

IPL-2025 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇవాళ తమ కెప్టెన్‌ను ప్రకటించనుంది. రజత్ పాటిదార్‌ను కెప్టెన్‌గా ఖరారు చేసినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాటిదార్ కెప్టెన్‌గా మెప్పించారు. మధ్యప్రదేశ్ జట్టును ఫైనల్‌కు చేర్చారు. 2021 నుంచి RCBకి ఆడుతున్నారు. కాగా కోహ్లీ తిరిగి RCB కెప్టెన్సీ బాధ్యతలు చేపడతారని గత కొంతకాలంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News February 13, 2025
రజినీకాంత్‌పై RGV కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్

రజినీకాంత్‌పై రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ‘క్యారెక్టర్‌ను బట్టి నటన ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆధారంగా స్టార్లవుతారు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. రజినీ గొప్ప నటుడా? నాకు తెలిసి భిఖు మాత్రే పాత్రను(సత్యలో మనోజ్ బాజ్‌పేయి) ఆయన చేయలేడు. ఆయన ఏం చేయకపోయినా స్లో మోషన్‌లో నడిచొస్తే చాలు ప్రేక్షకులు చూస్తారు’ అని ఓ ఇంటర్వ్యూలో RGV అన్నారు. దీంతో ఆయనపై రజినీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.