News July 11, 2024

మావోయిస్టులపై నిఘాకు యూఏవీ

image

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మావోయిస్టులపై నిఘా వేసేందుకు మానవరహిత గగనతల వాహనాలను(UAV) వినియోగించాలని భద్రతాబలగాలు భావిస్తున్నాయి. ఇవి 200 కిలోమీటర్ల పరిధిలో నిఘా వేయగలవని అంచనా. వీటితో మావోయిస్టుల కదలికలపై పూర్తి అంచనా వస్తుందని చెబుతున్నారు. యూఏవీ సమాచారం సరాసరి సెంట్రల్ మానిటర్ రూమ్స్‌కు చేరుకుంటుందని, వాటి ఆధారంగా చర్యలు చేపడతామని అధికారులు వివరిస్తున్నారు.

Similar News

News November 17, 2025

గంజాయి టెస్ట్.. స్పాట్‌లోనే రిజల్ట్స్!

image

TG: గంజాయిని శాశ్వతంగా అరికట్టడానికి పోలీస్ శాఖ నయా టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అనుమానం ఉన్నవారిని ‘యూరిన్ టెస్ట్ కిట్‌’తో టెస్ట్ చేసి స్పాట్‌లోనే ఫలితాన్ని నిర్ధారిస్తారు. సైబరాబాద్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్ల పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్లను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా పీఎస్‌లకు యూరిన్ కిట్లను పంపిణీ చేసినట్లు సమాచారం.

రేపు భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు రాష్ట్రంలో చలి తీవ్రరూపం దాల్చింది. సా.6 తర్వాత బయటికి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు.