News March 18, 2024

టాక్సీ డ్రైవర్లకు ఉబర్ రూ.1,475 కోట్ల పరిహారం

image

ఆస్ట్రేలియాలో టాక్సీ డ్రైవర్లకు రూ.1,475 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఉబర్ అంగీకరించింది. దేశ చరిత్రలో ఇది ఐదో అతిపెద్ద సెటిల్‌మెంట్‌గా న్యాయ నిపుణులు వెల్లడించారు. తమ దేశంలోకి ఉబర్ ప్రవేశించడంతో ఉపాధి కోల్పోయామంటూ 8వేల మంది టాక్సీ డ్రైవర్లు 2019లో కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఎట్టకేలకు పరిహారం ఇచ్చేందుకు కంపెనీ అంగీకరించడంతో వివాదానికి తెరపడింది.

Similar News

News October 31, 2024

ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణకు సిద్ధమే.. కానీ: ఖాసిమ్

image

నస్రల్లా స్థానంలో హెజ్బొల్లా చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నయీమ్ ఖాసిమ్ తొలిసారి ప్రసంగించారు. ఇజ్రాయెల్‌పై పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. ఆ దేశం దురాక్రమణను ఆపి తమకు అనుకూలమైన షరతులకు ఒప్పుకుంటే కాల్పుల విరమణకు సిద్ధమేనని తెలిపారు. అందుకోసం తామేమీ అడుక్కోబోమని స్పష్టం చేశారు. నస్రల్లా అనుసరించిన వార్ ప్లాన్‌కు కట్టుబడి ఉంటామన్నారు. కాగా ఈ కొత్త చీఫ్ ఎంతో కాలం ఉండరని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

News October 31, 2024

విక్రయాల్లో ‘వివో’.. విలువలో ‘శాంసంగ్’ టాప్

image

భారత్‌లో స్మార్ట్ ఫోన్ విక్రయాల పరంగా 19.4% వాటాతో వివో అగ్రస్థానంలో నిలిచినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ మూడో క్వార్టర్ గణాంకాలను అది వెలువరించింది. ఆ తర్వాత షావోమి(16.7%), శాంసంగ్(15.8%), ఒప్పో(13.4%), రియల్‌మీ(11.3%) ఉన్నాయంది. ఇక విక్రయాల్లో విలువపరంగా 22.8% వాటాతో శాంసంగ్ టాప్‌లో ఉన్నట్లు తెలిపింది. రెండో స్థానంలో యాపిల్(21.8%) ఉన్నట్లు పేర్కొంది.

News October 31, 2024

ఏపీలో మరో రెండు బీసీ గురుకులాలు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 107 బీసీ గురుకులాలు ఉండగా మరో రెండు కొత్త గురుకులాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా రాంపురం(పెనుకొండ), నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అద్దె భవనాల్లో వీటిని ప్రారంభించనుంది. 5, 6, 7, 8 తరగతుల విద్యార్థులతో 240 సీట్లను కేటాయించింది. పెనుకొండలో సీట్ల భర్తీ పూర్తయ్యింది. ఆత్మకూరులో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది.