News March 18, 2024

టాక్సీ డ్రైవర్లకు ఉబర్ రూ.1,475 కోట్ల పరిహారం

image

ఆస్ట్రేలియాలో టాక్సీ డ్రైవర్లకు రూ.1,475 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఉబర్ అంగీకరించింది. దేశ చరిత్రలో ఇది ఐదో అతిపెద్ద సెటిల్‌మెంట్‌గా న్యాయ నిపుణులు వెల్లడించారు. తమ దేశంలోకి ఉబర్ ప్రవేశించడంతో ఉపాధి కోల్పోయామంటూ 8వేల మంది టాక్సీ డ్రైవర్లు 2019లో కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఎట్టకేలకు పరిహారం ఇచ్చేందుకు కంపెనీ అంగీకరించడంతో వివాదానికి తెరపడింది.

Similar News

News April 17, 2026

SHOCKING: ‘జైలర్-2’ కీలక సీన్ లీక్!

image

మొన్న విజయ్ <<19615293>>‘జననాయగన్’<<>>.. నేడు రజినీకాంత్ ‘జైలర్-2’. పైరసీ భూతం కోలీవుడ్ పెద్ద సినిమాలను వెంటాడుతోంది. నెల్సన్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘జైలర్-2’ షూటింగ్ స్పాట్‌లో తీసిన వీడియో క్లిప్ లీకైనట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ సీరియస్ అయింది. లీకైన దృశ్యాలను ఎవరూ షేర్ చేయవద్దని, అలా చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని సన్ పిక్చర్స్ హెచ్చరించింది.

News April 17, 2026

ముర్రా జాతి గేదెలతో ఎందుకు మేలంటే?

image

ముర్రా జాతి పశువు జీవితకాలం 20 ఏళ్లుగా ఉంటుంది. 10 ఈతలు ఈనడానికి అవకాశం ఉంటుంది. రెండున్నరేళ్ల నుంచి మూడేళ్ల వయసు మధ్యలో ముర్రా గేదెలు ఎదకు వస్తాయి. ఏటా ఈ గేదెలకు దూడ పుట్టడం పాడి రైతుకు లాభదాయకం. ముర్రా గేదెలు ఈనిన తర్వాత 3 నెలలకే మళ్లీ ఎదకు రావడం వాటిలో గొప్ప లక్షణం. తర్వాత పది నెలలకు ఈనుతుంది. ఇలా ప్రతి ఏడాదీ దూడ పుట్టడానికి, పాల దిగుబడి తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.

News April 17, 2026

ఒంటరితనంపై హన్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

image

వైవాహిక బంధం నుంచి బయటికొచ్చిన నటి హన్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటి ఒంటరి జీవితం తనకు సంతోషాన్ని ఇస్తోందని అభిమానులతో చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. అంతేకాక చాలా స్వేచ్ఛగా ఉన్నట్లు తెలిపారు. తన వాళ్లతో సమయం గడుపుతూ, నచ్చిన పనులు చేస్తూ హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. ఒంటరితనం తనకు ఎప్పుడూ ఇష్టమన్నారు. మనస్పర్ధలు, ఇతర కారణాలతో మాజీ భర్త సోహైల్ నుంచి హన్సిక విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.