News February 5, 2025

UCC: మొదటి ‘సహ జీవనం’ జోడీ నమోదు

image

ఉత్తరాఖండ్‌లో UCC అమల్లోకి వచ్చిన 9 రోజుల తర్వాత సహజీవనం చేస్తున్న మొదటి జోడీ తమ బంధాన్ని రిజిస్టర్ చేసుకుంది. మరో రెండు జంటల అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నాయని తెలిసింది. నిబంధనల ప్రకారం UCC అమల్లోకి వచ్చిన నెల రోజుల్లోనే ‘లివిన్ కపుల్స్’ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. గడువు దాటితే 6 నెలల వరకు జైలుశిక్ష, రూ.25వేల ఫైన్ లేదా ఆ రెండూ విధించొచ్చు. ఇక మంగళవారం నాటికి 359 పెళ్లిళ్లు నమోదయ్యాయి.

Similar News

News April 19, 2026

రాష్ట్రంలో భానుడి భగభగ.. ADBలో 44.3 డిగ్రీలు

image

TG: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు అత్యధికంగా ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. నిజామాబాద్‌లో 43.1, మహబూబ్‌నగర్ 42.4, మెదక్ 42, రామగుండం 41.5, హకీంపేట్ 41.1, దుండిగల్ 40.3, భద్రాచలం 40.4, HYD 40.4, నల్గొండ 40, ఖమ్మంలో 40 డిగ్రీలుగా రికార్డయినట్లు వెల్లడించింది.

News April 19, 2026

చిన్న సినిమా సంచలనం.. రూ.10 కోట్లతో తీస్తే రూ.200 కోట్లు!

image

మలయాళ మూవీ ‘వాజా 2: బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 17 రోజుల్లోనే రూ.200+ కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్కూల్లో అల్లరి చిల్లరగా తిరిగే నలుగురు కుర్రాళ్లు జీవితంలో ఎలా సెటిలయ్యారనేదే కథ. ఈ సినిమా తెలుగులో వాలా-2 పేరుతో ఈ నెల 24న రిలీజవనుంది. రేపు ట్రైలర్ విడుదల కానుంది.

News April 19, 2026

గవర్నర్‌తో సీఎం భేటీ.. ఎమ్మెల్సీల ఆమోదంపై చర్చ?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ HYDలోని లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సమావేశమయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరామ్, అజహరుద్దీన్‌ పేర్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏ సభలోనూ సభ్యుడు కాని అజారుద్దీన్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నెల 30 లోపు ఎమ్మెల్సీగా ఎంపిక కాకపోతే ఆయన పదవిని కోల్పోయే అవకాశం ఉంది.