News April 29, 2024
యూజీసీ నెట్ పరీక్ష తేదీలో మార్పు

యూజీసీ నెట్ <<13096508>>పరీక్ష<<>> తేదీని జూన్ 16 నుంచి జూన్ 18కి మారుస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. జూన్ 16న UPSC ప్రిలిమ్స్ కూడా ఉండడంతో నెట్ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరగా, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు.
Similar News
News November 24, 2025
మహిళల పేరున సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం: సీతక్క

భూపాలపల్లి జిల్లాలో మహిళా సంఘాలకు ఇప్పటివరకు 6 బస్సులను ఇచ్చామని, వారికి నెలకు రూ.70 వేల వరకు ఆదాయం వస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ.. మూడున్నర ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మహిళల పేరున మంజూరు చేయనున్నట్లు తెలిపారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.6 కోట్ల వడ్డీలేని రుణాన్ని అందిస్తామన్నారు.
News November 24, 2025
అక్రమ మైనింగ్.. ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

TG: పటాన్చెరు MLA మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్కు చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని ఈడీ గుర్తించింది. అనుమతి లేకుండా, పరిమితికి మించి మైనింగ్ చేస్తూ రూ.300 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.39Cr రాయల్టీ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు మధుసూదన్కు చెందిన రూ.80 కోట్లు అటాచ్ చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది.
News November 24, 2025
ఎల్లుండి ఇలా చేస్తే వివాహ సమస్యలు దూరం!

ఎల్లుండి సుబ్రహ్మణ్య షష్ఠి. దీనిని స్కందషష్ఠి అని కూడా పిలుస్తారు. ఈరోజున సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్త్రోత్ర పారాయణం, వల్లీ-దేవసేన కళ్యాణం వంటివి చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇవి చేస్తే జాతక పరంగా వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, పిల్లల బుద్ధి కుశలత, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. SHARE IT


