News April 29, 2024

యూజీసీ నెట్ పరీక్ష తేదీలో మార్పు

image

యూజీసీ నెట్ <<13096508>>పరీక్ష<<>> తేదీని జూన్ 16 నుంచి జూన్ 18కి మారుస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. జూన్ 16న UPSC ప్రిలిమ్స్ కూడా ఉండడంతో నెట్‌ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరగా, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు.

Similar News

News November 12, 2024

ALERT: యాపిల్ డివైజ్‌లు వాడుతున్నారా?

image

యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్స్, మాక్స్, వాచ్‌లు వంటి డివైజ్‌లలో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని CERT-In వెల్లడించింది. 18.1 లేదా 17.7.1 IOSకు ముందు వెర్షన్‌లు వాడుతున్న ఐఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశముందని హెచ్చరించింది. IOS 18.1 లేదా 17.7.1 వెర్షన్‌లో వాడుతున్న మాక్‌లు, IOS 11 కంటే ముందు సాఫ్ట్‌వేర్ కలిగిన వాచ్‌లకు ఈ ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. లేటెస్ట్ వెర్షన్స్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

News November 12, 2024

ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా BRS అడ్డుకుంటోంది: మంత్రి శ్రీధర్

image

TG: ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా బీఆర్ఎస్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనను రాజకీయం చేయాలనుకోవట్లేదని చెప్పారు. భూసేకరణపై ప్రజాభిప్రాయం కోసం కలెక్టర్ గ్రామానికి వెళ్లారని, కొందరు రైతుల్ని రెచ్చగొట్టి దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ కుట్ర వెనుక ఉంది ఎవరో విచారణలో తేలుతుందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News November 12, 2024

బాలయ్య కొత్త సినిమా టీజర్ ఎప్పుడంటే?

image

నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తోన్న ‘NBK109’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర టైటిల్ & టీజర్‌ను ఈనెల 15న ఉదయం 10.24గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నాగవంశీ నిర్మించారు.