News June 21, 2024
UGC-NET పేపర్ లీక్.. ఎఫ్ఐఆర్ నమోదు

యూజీసీ నెట్ పేపర్ లీకేజీ కేసులో కేంద్ర విద్యాశాఖ సూచనలతో గుర్తు తెలియని వ్యక్తులపై CBI ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నెల 18న యూజీసీ నెట్ నిర్వహించగా మరుసటి రోజే పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయనే జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ నివేదికతో అవకతవకలకు ప్రాథమిక ఆధారాలున్నాయని యూజీసీ నిర్ధారించింది. త్వరలోనే ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
Similar News
News January 19, 2026
WOW.. వైర్లు లేకుండానే విద్యుత్ సరఫరా!

వైర్లు లేకుండానే గాలిలో కరెంట్‌ను పంపి ఫిన్‌లాండ్ శాస్త్రవేత్తలు సంచలనం సృష్టించారు. హెల్సింకి, ఔలు యూనివర్సిటీల శాస్త్రవేత్తలు అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాలు, లేజర్ కిరణాల సహాయంతో విద్యుత్తును ఒక చోటు నుంచి మరోచోటుకు విజయవంతంగా పంపారు. ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ‘అకౌస్టిక్ వైర్’ టెక్నాలజీ వల్ల ఫ్యూచర్‌లో ప్లగ్, వైర్ల అవసరం తగ్గుతుంది. Wi-Fi లాగే రేడియో తరంగాల ద్వారా పరికరాలకు విద్యుత్ సరఫరా అందనుంది.
News January 19, 2026
మళ్లీ పెరిగిన బంగారం ధర!

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18894920>>మళ్లీ<<>> పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.2,460 పెరిగి రూ.1,46,240కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,250 ఎగబాకి రూ.1,34,050 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.8వేలు పెరిగి రూ.3,18,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 19, 2026
కొత్త ట్రెండ్.. పదేళ్లలో ANY CHANGE?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘2016 Vs 2026’ ఛాలెంజ్ తెగ ట్రెండ్ అవుతోంది. పదేళ్ల కాలంలో తమ రూపం ఎంతలా మారిందో చూపేలా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ పాత, కొత్త ఫొటోలతో పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా సినీ తారల మేకోవర్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు కరీనా, అనన్య, సోనమ్ కపూర్ సైతం వారి ఓల్డ్ ఫొటోస్ షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ ట్రెండ్‌ను మీరూ ట్రై చేశారా?


