News May 24, 2024

యూపీ యువతికి UK రాయల్ అవార్డు

image

UPకి చెందిన ఆర్తి(18)అనే ఇ-రిక్షా డ్రైవర్ లండన్‌లో ఉమెన్స్ ఎంపవర్‌మెంట్ అవార్డును అందుకున్నారు. పింక్ ఇ-రిక్షా నడుపుతూ ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచినందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఈ ఈవెంట్ తర్వాత ఆమె బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్ IIIని కలిసి ఫొటోలు దిగారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రిన్స్ ట్రస్ట్ ఇంటర్నేషనల్, అగాఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కేంద్రం పింక్ ఇ-రిక్షా పథకాన్ని అమలు చేస్తోంది.

Similar News

News February 19, 2025

‘ఐదుగురు స్పిన్నర్లెందుకు?’.. రోహిత్ స్ట్రాంగ్ రిప్లై

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం ఐదుగురు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ జవాబిచ్చారు. ‘మీకు ఐదుగురు స్పిన్నర్లు కనిపిస్తున్నారు. కానీ నాకు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లు కనిపిస్తున్నారు. జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వల్ల బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ అవుతుంది’ అని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ తమకెంతో ముఖ్యమని తెలిపారు.

News February 19, 2025

KCR ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు: మంత్రి

image

TG: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని <<15513169>>KCR<<>> ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 14 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఎలా కనపడుతుందని ప్రశ్నించారు. ‘KCRకు ఎన్నిక‌ల‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌జ‌లు గుర్తుకొస్తారు. ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి ప్ర‌తిప‌క్షంలో కూర్చోబెడితే ప్ర‌జా తీర్పును గౌర‌వించ‌లేదు. అసెంబ్లీ వైపు రాలేదు’ అని విమర్శించారు.

News February 19, 2025

రాష్ట్రంలో రానున్న 2, 3 రోజుల్లో చిరుజల్లులు

image

TG: గాలిలో అనిశ్చితి కారణంగా రాబోయే 2, 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది. సాధారణం కన్నా ఒకటి, రెండు డిగ్రీలు మాత్రమే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఉక్కపోత ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.

error: Content is protected !!