News September 28, 2024
రిటైర్మెంట్ ప్రకటించిన అంపైర్ అలీమ్ దార్
పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ అంపైరింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. పాక్‌లో ప్రస్తుత దేశవాళీ సీజన్ ముగిసిన అనంతరం తప్పుకొంటానని పేర్కొన్నారు. ఆయన దాదాపు 25 ఏళ్ల పాటు అంపైర్‌గా చేశారు. 2009-11 మధ్యకాలంలో మూడుసార్లు అంపైర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్నారు. మొత్తం 145 టెస్టులు, 231 ODIలు, 72 టీ20లు, 5 టీ20 కప్‌లు, 181 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, 282 లిస్ట్-ఏ మ్యాచుల్లో దార్ అంపైర్‌గా నిల్చున్నారు.
Similar News
News October 13, 2024
మీ పిల్లలకు ఇవి నేర్పుతున్నారా?
వయసు పెరిగే పిల్లలకు తల్లిదండ్రులు కొన్ని స్కిల్స్ నేర్పించాలి. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, సాయం చేయడం వంటివి నేర్పాలి. చెట్లు నాటడం, సంరక్షణ, తోటి పిల్లలతో ఎలా మెలగాలో చెప్పాలి. డబ్బు విలువ తెలియజేయాలి, వస్తువులపై ధరలు, క్వాలిటీ వంటివి చూపించాలి. మార్కెట్‌లో బేరాలు ఆడటం నేర్పించాలి. ఎమోషనల్ బ్యాలెన్స్‌పై అవగాహన కల్పించాలి. పెద్దలను గౌరవించేలా తీర్చిదిద్దాలి.
News October 13, 2024
‘దసరా’ దర్శకుడితో నాని మరో మూవీ
‘దసరా’ మూవీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో హీరో నాని ఓ సినిమా చేయబోతున్నారు. దసరా సందర్భంగా ముహూర్త షాట్‌కు హీరో నాని క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
News October 13, 2024
సంజూ శాంసన్ సెల్ఫ్‌లెస్ ప్లేయర్: సూర్య
వికెట్ కీపర్ సంజూ శాంసన్ సెల్ఫ్ లెస్ క్రీడాకారుడు అని టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. సెంచరీ ముందు కూడా బౌండరీ బాదడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ‘నాకు నిస్వార్ధపరులైన ఆటగాళ్లతో కూడిన జట్టు అంటే ఇష్టం. ఎవరైనా 49 లేదా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు సింగిల్ కోసం ప్రయత్నించి జట్టు ప్రయోజనాలు దెబ్బ తీయొద్దు. పరుగులు సాధించే క్రమంలో రికార్డులు వాటంతటవే రావాలి’ అని ఆయన పేర్కొన్నారు.