News November 28, 2024
ఉనద్కత్.. IPL వేలంలో 13వసారి..
IPL-2025 వేలంపాటలో భారత సీనియర్ క్రికెటర్ జయ్‌దేవ్ ఉనద్కత్ రికార్డు సృష్టించారు. ఆయనను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.1కోటికి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే వేలంలో ఎక్కువసార్లు అమ్ముడైన ఏకైక క్రికెటర్‌గా ఆయన అవతరించారు. ఆయనకు ఇది 13వ IPL వేలం. ఏడుసార్లకు మించి ఎవరూ అమ్ముడవలేదు. కాగా ఉనద్కత్ తన IPL కెరీర్‌లో 8 జట్లకు ఆడారు. KKR, DD, RPS, RR, MI, LSG, RCBకి ఆడారు.
Similar News
News December 12, 2024
2024: గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాలివే..
ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ సినిమాల లిస్ట్‌ను గూగుల్ ట్రెండ్స్ రిలీజ్ చేసింది. ఇందులో శ్రద్ధాకపూర్ నటించిన ‘స్త్రీ2’ తొలి స్థానంలో నిలిచింది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో కల్కి 2898AD, 12TH FAIL, లాపతా లేడీస్, హనుమాన్, మహారాజ, మంజుమ్మల్ బాయ్స్, గోట్, సలార్, ఆవేశం టాప్-10లో నిలిచాయి.
News December 12, 2024
రాష్ట్ర పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
AP: రాష్ట్రంలో హెల్మెట్ నిబంధన అమలు కావట్లేదని పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ ధరించకపోవడం వల్ల 667 మంది మరణించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో హెల్మెట్ నిబంధన ఎందుకు అమలు చేయట్లేదు? అని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ మరణాలకు బాధ్యత ఎవరిది? అని సీరియస్ అయింది. దీనిపై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
News December 12, 2024
వాట్సాప్, FB సేవలు డౌన్.. స్పందించిన ‘మెటా’
FB, ఇన్‌స్టా, వాట్సాప్ సేవలు <<14854292>>డౌన్<<>> అవ్వడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఈ యాప్‌ల మాతృసంస్థ మెటా స్పందించింది. తమ అప్లికేషన్లను కొందరు వినియోగదారులు యాక్సెస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలిసిందని పేర్కొంది. సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగిందని, వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది. అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు కోరింది.