News December 2, 2024
UNBELIEVABLE: బ్రేక్ చేయలేని రికార్డు!

క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నమోదై, బద్దలవుతుంటాయి. ఎవ్వరూ అందుకోలేని రికార్డులూ ఉంటాయి. అందులో సచిన్ రికార్డులు ఫస్ట్. అయితే మరో భారత క్రికెటర్ కూడా ఎవరికీ సాధ్యంకాని ఓ రికార్డు నమోదు చేశారు. 1964లో లెఫ్టార్మ్ స్పిన్నర్ బాపు నాదకర్ణి ఇంగ్లండ్‌పై వరుసగా 21 ఓవర్లు మెయిడెన్ చేశారు. ఆ మ్యాచ్‌లో మొత్తం 32 ఓవర్లు వేసి కేవలం 5 రన్స్ ఇచ్చారు. తాజాగా WI బౌలర్ జేడెన్ సీల్స్ వరుసగా 6 మెయిడెన్స్ వేశారు.
Similar News
News February 18, 2025
విజయ్‌తో డేటింగ్ రూమర్స్.. రష్మిక పోస్ట్ వైరల్

విజయ్ దేవరకొండతో డేటింగ్ రూమర్స్ నేపథ్యంలో రష్మిక చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. రోజ్ ఫ్లవర్ బొకేను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఆమె ‘నా ముఖంపై చిరునవ్వు ఎలా తెప్పించాలో నీకు బాగా తెలుసు పాపలు❤️’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆ బొకే VDనే పంపించి ఉంటారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల విజయ్ ‘కింగ్‌డమ్’ టైటిల్ అనౌన్స్‌మెంట్ సమయంలో రష్మిక అతడిని <<15440673>>పొగుడుతూ<<>> ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
News February 18, 2025
సీఈసీ నియామకం.. కేంద్రంపై కాంగ్రెస్ మండిపాటు

చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) ప్రకటన కేంద్రం తొందరపాటు నిర్ణయమని కాంగ్రెస్ మండిపడింది. ‘ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కలిగి ఉండాలని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు పునరుద్ఘాటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిష్పక్షపాతంగా ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే సీఈసీ నియామకాన్ని చేపట్టడం అత్యున్నత ధర్మాసనాన్ని అవమానించడమే’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ విమర్శించారు.
News February 18, 2025
బంపర్ ఆఫర్ ఇంకా ఉంది: మస్క్

గతంలో వికీపీడియా పేరు మార్పుపై ప్రకటించిన ఆఫర్ ఇప్పటికీ ఉందని మస్క్ ట్వీట్ చేశారు. గతంలో ఆసంస్థ పేరును అసభ్యకరంగా మార్చుకుంటే 1బిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తానని మస్క్ ప్రకటించారు. అయితే ఒక యూజర్ ఈ ఆఫర్ ఇంకా ఉందా అని అడగగా ‘అవును పేరు మార్చుకుంటే ఉంటుంది’ అని మస్క్ బదులిచ్చారు.