News December 26, 2024
మహాకుంభమేళా కోసం అండర్‌వాటర్ డ్రోన్లు
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోంది. తొలిసారిగా అండర్ వాటర్ డ్రోన్‌ను అధికారులు పరీక్షించారు. ఇది నీటి అడుగున వస్తువు/మనుషులను కూడా గుర్తిస్తుందని, ఎవరైనా మునిగిపోతే వెంటనే రక్షించడానికి వీలవుతుందని తెలిపారు. 12 ఏళ్లకోసారి నిర్వహించే ఈ కుంభమేళాకు ఈసారి దాదాపు 45 కోట్ల మంది భక్తులు రానున్నట్లు అంచనా.
Similar News
News January 18, 2025
డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
AP: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రాజెక్టు సీఈ, అధికారులు భూమిపూజ, హోమం నిర్వహించారు. అనంతరం వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.990 కోట్లు ఖర్చు చేయనుంది. సగం నిర్మాణం పూర్తి కాగానే దానిపై సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించనున్నారు.
News January 18, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్ల సునామీ
బాక్సాఫీస్ వద్ద ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ కలెక్షన్ల రాబడుతోంది. ఈ నెల 14న మూవీ విడుదల కాగా 4 రోజుల్లో రూ.131 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇవాళ, రేపు వీకెండ్స్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
News January 18, 2025
ఫ్రీ కోచింగ్.. ఫిబ్రవరి 15 నుంచి తరగతులు
TG: BC స్టడీ సర్కిళ్లలో RRB, SSC, బ్యాంకింగ్ తదితర రిక్రూట్‌మెంట్లకు ఫ్రీ కోచింగ్ తరగతులు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు JAN 20 నుంచి FEB 9 వరకు అప్లై చేసుకోవాలి. ఇంటర్, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. FEB 12-14 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. అభ్యర్థుల తల్లిదండ్రుల ఆదాయం గ్రామాల్లో ₹2L, పట్టణాల్లో ₹1.50Lకు మించకూడదు.
వెబ్‌సైట్: https://tgbcstudycircle.cgg.gov.in/