News February 25, 2025
అనైతిక లేఆఫ్స్: వెనక్కి తగ్గిన ఇన్ఫోసిస్!

ట్రైనీ ఇంజినీర్ల అసెస్మెంట్ టెస్టును ఇన్ఫోసిస్ నిరవధికంగా వాయిదా వేసింది. మైసూర్ క్యాంపస్‌లో 350 మందిని తొలగించిన కొన్ని రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది. OCTలో కంపెనీ 1000 మందిని నియమించుకుంది. వారు 3 దఫాల్లో అసెస్మెంట్ క్లియర్ చేయకుంటే ఇంటికెళ్లాల్సిందే. మొన్న ట్రైనీలను తొలగించిన <<15417347>>తీరు<<>>, ఈ అంశం లేబర్ మినిస్ట్రీకి చేరడం, దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో కంపెనీ మూడో అటెంప్టు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
Similar News
News March 17, 2025
నేటి నుంచి ‘యువ వికాసం’ దరఖాస్తులు షురూ

TG: ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల ప్రక్రియను సీఎం రేవంత్ నేడు ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 5వరకూ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం రూ.లక్ష నుంచి 3లక్షల వరకూ రుణాలు అందించనున్నారు. ఇందులో 60-80% వరకు రాయితీ ఉంటుంది. రూ.6 వేల కోట్లతో 5లక్షల మంది యువతకు రుణాలిచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దరఖాస్తుకు సైట్: tgobmms.cgg.gov.in
News March 17, 2025
రేపు ఢిల్లీకి చంద్రబాబు

AP: అమరావతి పున: ప్రారంభ పనుల ఆరంభోత్సవానికి PM మోదీని ఆహ్వానించేందుకు CM చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పీఎంతో ఆయన బుధవారం భేటీ కానున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులు, అమరావతికి సాయం సహా వివిధ అంశాలపై ఆయన మోదీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతారని సమాచారం.
News March 17, 2025
నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. ALL THE BEST

AP: నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉ.9.30 నుంచి మ.12.45 వరకు పరీక్ష ఉంటుంది. ఉ.8.45 గం. నుంచే సెంటర్లలోకి అనుమతిస్తారు. 6.49 లక్షల మంది విద్యార్థుల కోసం 3,450 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
*Way2News తరఫున ALL THE BEST