News October 3, 2024
వ్యక్తిగత విషయాలను ఆయుధంగా మార్చడం దురదృష్టకరం: వెంకటేశ్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విని ఎంతో బాధేసిందని హీరో విక్టరీ వెంకటేశ్ ట్వీట్ చేశారు. ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరం. ఇలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కానీ, ఆ వ్యక్తులకు మరింత బాధనిస్తుంది. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని కోరుతున్నా. సినీ పరిశ్రమ ఇలాంటివి సహించదు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 2, 2025
కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు: కవిత

విద్యా శాఖ స్వయంగా CM వద్దే ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం సిగ్గుచేటని జాగృతి చీఫ్ కవిత అన్నారు. గద్వాలలోని ST సంక్షేమ హాస్టల్లో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆమె X వేదికగా స్పందించారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ చేతగానితనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయటపెట్టిందన్నారు.
News December 2, 2025
నెల్లూరు జిల్లాకు ఏమైంది……?

ప్రశాంతమైన ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఏమైంది. ఒకవైపు గూడూరు ప్రజలేమో నెల్లూరులో తమ నియోజకవర్గాన్ని కలపాలని నిరసనలు చేస్తూ ఆవేదన చెందుతున్నారు. మరోవైపు నెల్లూరులో లేడీ డాన్లు గంజాయి ముఠాతో హత్యలు చేయిస్తున్నారు. గతంలో ఇదే గడ్డ మీద ఎందరో మహానుభావులు హుందాగా రాజకీయాలు చేశారు. అలాంటి నెల్లూరు జిల్లా గడ్డ మీద నేడు ఈ పరిస్థితులు చూస్తున్నావారు నెల్లూరు జిల్లాకు ఏమైంది అంటూ ఆలోచనలో పడ్డారు.
News December 2, 2025
టెస్లా కార్లపై ఆసక్తి చూపని భారతీయులు!

భారతీయ మార్కెట్లో టెస్లా కార్లకు ఆశించిన స్థాయిలో స్పందన లభించట్లేదు. OCTలో 40, NOVలో 48 కార్లే అమ్ముడయ్యాయి. JULY నుంచి ఇప్పటి వరకు మొత్తం 157 కార్లనే విక్రయించింది. అధిక ధరలు, విపరీతమైన పోటీ కారణంగా ఇండియన్స్ ఆసక్తి చూపట్లేదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఛార్జింగ్ స్టేషన్ల కొరత కూడా అమ్మకాలను ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు. కాగా మోడల్ Y ధర రూ.60లక్షలకు పైగా ఉంది.


