News March 16, 2025
ఇష్టం లేని కోర్సులో విద్యార్థిని.. భరోసా ఇచ్చిన కేంద్రమంత్రి

తల్లిదండ్రుల ఒత్తిడితో ఇష్టమైన సైన్స్ కోర్సులో కాకుండా ఆర్ట్స్‌లో చేరినట్లు బిహార్‌కు చెందిన ఖుష్భూ ఓ ఇంటర్వ్యూలో కన్నీరుమున్నీరయ్యారు. ఇది కాస్త కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి చేరడంతో ఆమెకు కాల్ చేసి ధైర్యం చెప్పారు. సైన్స్ కోర్సులో చేరమని, డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకోవాలని తెలిపారు. కాగా టెన్త్ పరీక్షల్లో 500కు 399 మార్కులు రాగా పేదిరికం వల్ల ఆమె పేరెంట్స్ ఆర్ట్స్‌లో చేర్పించారు.
Similar News
News March 18, 2025
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామి వారి దర్శనానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 70,824 మంది భక్తులు దర్శించుకోగా 25,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు సమకూరింది.
News March 18, 2025
బీటెక్ ఫస్టియర్ రిజల్ట్.. 75% విద్యార్థులు ఫెయిల్!

TG: జేఎన్టీయూహెచ్ అనుబంధ కాలేజీల బీటెక్ ఫస్టియర్ సెమిస్టర్ ఫలితాల్లో 75 శాతం మంది కనీసం ఒక్క సబ్జెక్ట్ ఫెయిలయ్యారు. మొత్తం 40 వేల మంది విద్యార్థుల్లో 10వేల మంది(25%) మాత్రమే అన్ని సబ్జెక్టులూ పాసైనట్లు సమాచారం. అత్యధికంగా మ్యాథ్స్(M1), డ్రాయింగ్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారని తెలుస్తోంది. ఫస్ట్ సెమిస్టర్(రెగ్యులర్), రెండో సెమిస్టర్(సప్లిమెంటరీ) ఫలితాలు వెబ్సైట్లో ఉంచారు.
News March 18, 2025
రెండు రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లా బేలలో గరిష్ఠంగా 42 డిగ్రీలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 21 నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొన్న సంగతి తెలిసిందే.