News July 11, 2024
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కేంద్రమంత్రి

AP: కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంటుకు చేరుకున్నారు. సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి ఆయన ప్లాంట్‌ను పరిశీలిస్తున్నారు. మరికాసేపట్లో అధికారులు, కార్మిక సంఘాలతో ఆయన భేటీ కానున్నారు. ఉక్కు పరిశ్రమ నిర్వహణపై కుమారస్వామి ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.
Similar News
News February 17, 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసేది ఎవరంటే?: క్లార్క్

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేస్తారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ క్లార్క్ జోస్యం చెప్పారు. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆయన తిరిగి ఫామ్‌లోకి వచ్చారని చెప్పారు. మరోవైపు ENG ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ అత్యధిక వికెట్లు తీస్తారని అభిప్రాయపడ్డారు. ఈ సిరీస్‌లో జోఫ్రాను ఎదుర్కోవడం కష్టమేనని తెలిపారు. అయితే ఆస్ట్రేలియా ఫైనల్ వెళ్తుందన్నారు.
News February 17, 2025
ఫుడ్ డెలివరీ సంస్థలకు ‘చికెన్’ దెబ్బ!

తెలుగు రాష్ట్రాల ప్రజలను ‘బర్డ్ ఫ్లూ’ భయం వెంటాడుతోంది. కొంతకాలం చికెన్ తినకపోవడమే బెటర్ అని చాలామంది దూరంగా ఉంటున్నారు. ఈ ప్రభావం చికెన్ దుకాణాలపైనే కాకుండా ఫుడ్ డెలివరీ సంస్థలపైనా పడింది. జొమాటో, స్విగ్గీ తదితర యాప్స్‌లో చికెన్ ఐటమ్స్ ఆర్డర్స్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. బదులుగా ఫిష్, మటన్ వంటకాలు ఆర్డర్ చేస్తున్నారు. అటు చికెన్ ఆర్డర్లు లేక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లూ వెలవెలబోతున్నాయి.
News February 17, 2025
పండ్ల మార్కెట్లో అగ్నిప్రమాదం

AP: రాజమండ్రి దివాన్‌చెరువులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పండ్ల మార్కెట్‌లోని కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి. వ్యాపారులు వెంటనే భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.