News June 19, 2024

‘బేటీ పఢావో.. బేటీ బచావో’ రాయలేకపోయిన కేంద్ర మంత్రి

image

కేంద్ర శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ‘బేటీ పఢావో, బేటీ బచావో’ నినాదాన్ని హిందీలో రాయలేకపోయారు. మధ్యప్రదేశ్‌లోని బ్రహ్మకుండిలో గల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ‘స్కూల్ ఛలో అభియాన్’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోర్డుపై స్లోగన్‌ను సరిగ్గా రాయలేకపోయారు. అయితే, అఫిడవిట్‌లో ఆమె 12వ తరగతి వరకు చదువుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై విమర్శలొస్తున్నాయి.

Similar News

News March 29, 2026

IPL: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్

image

ఐపీఎల్-2026లో తొలి రెండు వారాల్లో జరిగే మ్యాచులకు ధోనీ దూరమైనట్లు CSK ఇటీవల ప్రకటించింది. కానీ ఆయన ఏప్రిల్ చివరి వారం వరకూ మ్యాచులు ఆడకపోవచ్చని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన దాదాపు 6 మ్యాచులకు దూరం కానున్నట్లు టీమ్ వర్గాలు చెప్పినట్లు తెలిపాయి. కాగా CSK రేపు RR, ఏప్రిల్ 3న PBKS, 5న RCB, 11న DC, 14న KKR, 18న SRH, ఏప్రిల్ 23న MIతో తలపడనుంది.

News March 29, 2026

మరో 2 రోజులే గడువు!

image

దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర మంత్రి అమిత్ షా విధించిన గడవు మరో 2 రోజుల్లో(మార్చి 31) ముగుస్తోంది. ఆపరేషన్ కగార్‌తో వందల మంది నేలకొరగగా, ఇంకెంతో మంది లొంగిపోయారు, లొంగిపోతున్నారు. ఇందులో తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ), మల్లా రాజిరెడ్డి, మల్లోజుల, పాపారావు వంటి అగ్ర నేతలు ఉన్నారు. అయితే కీలక నేత గణపతి ఇంకా సరెండర్ కాలేదు. ఆయన నేపాల్‌లో ఉన్నారని ఈ నెల 31న లొంగిపోతారని వార్తలు వస్తున్నాయి.

News March 29, 2026

OTTలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. డేట్ ఇదేనా?

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17 లేదా 24వ తేదీన ఈ మూవీని స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ఈనెల 19న థియేటర్లలో విడుదలైంది.