News April 27, 2024

ఓటు వేయని కేంద్రమంత్రి.. తీవ్ర విమర్శలు

image

BJP నేత, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓటు వేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆయన కేరళలోని తిరువనంతపురం నుంచి MPగా పోటీ చేస్తున్నారు. ఆయనకు బెంగళూరులో ఓటు హక్కు ఉంది. ఈ రెండుచోట్లా నిన్న పోలింగ్ జరిగింది. కాగా తాను తిరువనంతపురంలో ఉండటానికే ప్రాధాన్యం ఇచ్చానని, ఓటు వేయలేదని చెప్పారు. దీంతో బాధ్యత గల పదవిలో ఉండి ఓటు వేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News November 18, 2025

ఎన్‌కౌంటర్స్‌ మొత్తం ఫేక్: కూనంనేని

image

మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లు మొత్తం ఫేక్ అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మావోయిస్టులను చంపుకుంటూ పోవడం మానవ హననమేనని, ఇది జంగిల్‌ రాజ్‌ పరిపాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ పోలీసులు ఇందులో పావులుగా మారారని ఆరోపించారు. మాడేరుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌తో సహా అన్ని ఎన్‌కౌంటర్లు కట్టుకథలని ఆయన స్పష్టం చేశారు.

ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

image

ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.