News April 27, 2024

ఓటు వేయని కేంద్రమంత్రి.. తీవ్ర విమర్శలు

image

BJP నేత, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓటు వేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆయన కేరళలోని తిరువనంతపురం నుంచి MPగా పోటీ చేస్తున్నారు. ఆయనకు బెంగళూరులో ఓటు హక్కు ఉంది. ఈ రెండుచోట్లా నిన్న పోలింగ్ జరిగింది. కాగా తాను తిరువనంతపురంలో ఉండటానికే ప్రాధాన్యం ఇచ్చానని, ఓటు వేయలేదని చెప్పారు. దీంతో బాధ్యత గల పదవిలో ఉండి ఓటు వేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News November 4, 2024

నవంబర్ 4: చరిత్రలో ఈరోజు

image

* 1888: పారిశ్రామికవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ జననం
* 1929: ప్రపంచ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలా దేవి జననం
* 1944: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో తొలి మహిళా ఎయిర్ మార్షల్ పద్మావతి బందోపాధ్యాయ పుట్టినరోజు
* 1964: దర్శకుడు, నిర్మాత జొన్నలగడ్డ శ్రీనివాస రావు పుట్టినరోజు
* 1971: సినీనటి టబు పుట్టినరోజు(ఫొటోలో)

News November 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 4, 2024

ఇండియా-Aకు ఆడనున్న KL.. కారణమిదే!

image

NZతో టెస్ట్ సిరీస్‌‌లో ప్రాక్టీస్ లభించని ఆటగాళ్లను ఇండియా-A తరఫున ఆడించాలని BCCI నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా KL రాహుల్, ధృవ్ జురెల్‌ను రేపు ఆస్ట్రేలియాకు పంపనున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. AUS-A, IND-A మధ్య జరిగే మ్యాచుల్లో వీరు ఆడనున్నట్లు పేర్కొన్నాయి. రాహుల్‌కు NZ సిరీస్‌లో తొలి టెస్ట్ మాత్రమే ఆడే అవకాశం రాగా, జురెల్ వికెట్ కీపింగ్ మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.