News June 4, 2024

ముందంజలో కేంద్ర మంత్రులు

image

గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి బరిలోకి దిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ అభ్యర్థి సోనల్ పటేల్‌పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ముందంజలో ఉన్నారు.

Similar News

News December 5, 2025

జగిత్యాల: జిల్లా స్థాయి పీఎం శ్రీ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

image

జగిత్యాల జిల్లా స్థాయి పీఎం శ్రీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్‌ను వివేకానంద మినీ స్టేడియంలో అడిషనల్ కలెక్టర్ బి.ఎస్.లత ప్రారంభించారు. జిల్లాలోని 16 పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన 900 మంది విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ పోటీలలో పాల్గొన్నారు. ఆటలు విద్యార్థుల్లో ఆరోగ్యం, మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని లత తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాము, రాజేష్, చక్రధర్, విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

News December 5, 2025

రాజకీయాల్లోకి రమ్మని లోకేశ్‌ను ఫోర్స్ చేయలేదు: CBN

image

AP: పిల్లల్లోని ఇన్నోవేటివ్ ఆలోచనలు గుర్తించేందుకు స్టూడెంట్స్ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని CM CBN PTMలో తెలిపారు. ‘నేనెప్పుడూ లోకేశ్ స్కూలుకు వెళ్లలేదు. టీచర్లతోనూ మాట్లాడలేదు. ఫౌండేషన్ ఇప్పించానంతే. చదువుకొని మంత్రి అయ్యారు. రాజకీయాల్లోకి రమ్మనీ ఫోర్స్ చేయలేదు’ అని అన్నారు. కష్టంగా ఉంటుందన్నా విద్యాశాఖనే ఎంచుకున్నారని చెప్పారు. విద్యార్థులు కలలు సాకారం చేసుకొనేలా అండగా ఉంటామన్నారు.

News December 5, 2025

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 124 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<>SAIL<<>>)లో 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. నేటితో అప్లై గడువు ముగియనుండగా.. DEC 15వరకు పొడిగించారు. ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.sail.co.in