News December 3, 2024

అమెరికాలో కలిసిపోండి: ట్రూడోతో ట్రంప్

image

కెనడా తమ దేశంలో కలిసిపోవాలని ఆ దేశ ప్రధాని ట్రూడోకి అమెరికా ‘ప్రెసిడెంట్ ఎలక్ట్’ ట్రంప్ తాజాగా సూచించారు. ట్రూడో తాజాగా అమెరికాలో ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమపై సుంకాలు పెంచొద్దని ఆయన్ను విజ్ఞప్తి చేశారు. ‘మా నుంచి వాణిజ్యంలో రూ.100 బిలియన్ డాలర్లు దోచుకుంటే కానీ మీ దేశం మనుగడ సాగించలేదా? అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరిపోండి. మీరు దాని గవర్నర్‌గా ఉండండి’ అని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు.

Similar News

News January 13, 2025

INDvsPAK క్రికెట్ పోరుపై డాక్యుమెంటరీ

image

క్రికెట్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈ రెండు జట్లు తలపడితే దానినో యుద్ధంలా చూస్తారు. క్రికెట్ చరిత్రలో దాయాదుల పోరు గురించి NETFLIX ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్ చేసేందుకు వెళ్తోన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. INDvsPAK మ్యాచుల్లో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి.

News January 13, 2025

అక్షరాస్యత రేటులో 1% వృద్ధితో 25% పెరిగిన మహిళల ఓటింగ్

image

అక్షరాస్యత రేటులో ఒకశాతం పెరుగుదల మహిళల ఓటింగును 25% పెంచిందని SBI నివేదిక పేర్కొంది. 2019తో పోలిస్తే 2024లో 1.8 కోట్ల మహిళా ఓటర్లు పెరిగారు. అందులో 45 లక్షల వృద్ధికి అక్షరాస్యతే కారణమంది. ముద్రా వంటి స్కీములతో 36లక్షలు, పారిశుద్ధ్యం వల్ల 21లక్షలు, PMAY వల్ల 20లక్షల స్త్రీ ఓటర్లు పెరిగారని తెలిపింది. అక్షరాస్యత, ఉపాధి, గృహ యాజమాన్యం, విద్యుత్, నీరు వంటివి సానుకూల ప్రభావం చూపాయని వెల్లడించింది.

News January 13, 2025

PIC OF THE DAY: భక్తితో పాటు దేశభక్తి

image

144 ఏళ్లకు ఓసారి వచ్చే మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్ (యూపీ)లో ఘనంగా ప్రారంభమైంది. లక్షలాది మంది హిందూ సాధువులు, ప్రజలు గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇందులో ఓ వ్యక్తి త్రివర్ణ పతాకం చేతబూని రెపరెపలాడించాడు. భక్తి, దేశభక్తి అద్భుతమంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఈ మహా కుంభమేళా దేశానికి గర్వకారణం, గుర్తింపు అని యూపీ అధికారులు ట్వీట్ చేశారు.