News December 8, 2024
ఆడపిల్లల రక్షణకు కలిసిరండి: నిమ్మల

AP: మహిళలు, ఆడపిల్లల రక్షణే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మహిళలపై ఇటీవల జరుగుతున్న దాడులు బాధాకరమని, వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆడబిడ్డలను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కొందరు డ్రగ్స్, గంజాయికి బానిసలయ్యారని, ఈగల్ టీమ్ ద్వారా వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
Similar News
News January 7, 2026
మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్.. ఏది బెటర్?

ఈ ప్రశ్న తరచూ వినిపిస్తుంటుంది. నిజానికి రెండూ బెటరే. ఫిక్స్‌డ్ డిపాజిట్స్(FD)తో ఓ గ్యారంటీ, కంఫర్ట్ ఉంటుంది. నిర్ణీత వడ్డీ రేటుతో మెచ్యూరిటీ సమయంలో డబ్బు అందుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్(MF)ను పెద్ద కంపెనీల్లో పెట్టుబడిగా పెడతారు. దీంతో దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుతాయి. FD స్క్రూడ్రైవర్ లాంటిదైతే, MF పవర్ డ్రిల్ లాంటిదని నిపుణులు చెబుతారు. రిటర్న్స్, ట్యాక్స్ వంటి విషయాల్లో MF బెటర్ ఆప్షన్.
News January 7, 2026
పోర్టు వరకు పోలవరం నావిగేషన్ కెనాల్: CBN

AP: ఉత్పత్తుల జలరవాణా కోసం పోలవరం నుంచి విశాఖ పోర్టువరకు నావిగేషన్ కెనాల్ నిర్మిస్తున్నట్లు CM CBN తెలిపారు. దీనిద్వారా MH, TG తదితర ప్రాంతాల ఉత్పత్తులను భద్రాచలం మీదుగా జలమార్గంలో తరలించవచ్చని చెప్పారు. పోర్టు ద్వారా వీటిని విదేశాలకు ఎగుమతి చేయడం సులభమవుతుందని వివరించారు. ముందు చూపుతో ఈ కెనాల్‌ను ప్రాజెక్టు ప్రణాళికలో పెట్టించినట్లు వివరించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు సాగు నీరందిస్తామన్నారు.
News January 7, 2026
టెన్త్ విద్యార్థులకు స్నాక్స్.. నిధులు విడుదల

TG: పదో తరగతి విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4.23కోట్ల నిధులను విడుదల చేసింది. వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని డీఈవోలను ఆదేశించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు వీటిని అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి.


