News December 8, 2024

ఆడపిల్లల రక్షణకు కలిసిరండి: నిమ్మల

image

AP: మహిళలు, ఆడపిల్లల రక్షణే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మహిళలపై ఇటీవల జరుగుతున్న దాడులు బాధాకరమని, వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆడబిడ్డలను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కొందరు డ్రగ్స్, గంజాయికి బానిసలయ్యారని, ఈగల్ టీమ్ ద్వారా వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

Similar News

News November 7, 2025

కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై TG డైలమా

image

TG: కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం డైలమాలో పడింది. దీనికి మద్దతివ్వాలా? లేదా అనే దానిపై ఇంకా డెసిషన్ తీసుకోలేదని అధికారులు తెలిపారు. BILLలోని డిస్కామ్‌ల ప్రైవేటీకరణ, అగ్రి ఇతర రంగాలకు సబ్సిడీల తగ్గింపు తదితరాలను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే నిధుల కేటాయింపు వంటి అంశాలూ ఉండడంతో తర్జనభర్జన పడుతున్నారు. NOV 8లోగా అభిప్రాయాలు పంపాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.

News November 7, 2025

అద్దెకు తాతా..బామ్మా..

image

ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. దీంతో పిల్లలకు తాత, నానమ్మ, అమ్మమ్మల ఆప్యాయత, అనుబంధం దూరమవుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఆగ్రాలోని రామ్‌లాల్ వృద్ధాశ్రమం అద్దెకు తాతయ్య, బామ్మ అనే సరికొత్త సర్వీసు ప్రారంభించింది. దీని ద్వారా అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా, వారికి కుటుంబంతో ఉండే అనుభూతినిస్తుంది. జపాన్‌లోని సిస్టం స్ఫూర్తితో ప్రారంభించామని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.

News November 7, 2025

న్యూక్లియర్ వెపన్ రేసు మొదలైందా?

image

అణ్వాయుధ పరీక్షలు చేస్తామన్న ట్రంప్ <<18207970>>ప్రకటన<<>> అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనా, రష్యా, నార్త్ కొరియాలు మరోసారి న్యూక్లియర్ టెస్టులకు సిద్ధమవుతున్నాయి. ఇది క్రమంగా న్యూక్లియర్ వెపన్స్ రేసుకు దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిగతా అణ్వాయుధ దేశాలైన UK, ఫ్రాన్స్, ఇండియా, పాక్ కూడా ఆ బాట పట్టొచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 12K న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లు అంచనా.