News March 20, 2024

ఫోన్ల లాక్ తీయించి ప్రశ్నలు!

image

TG: ఎమ్మెల్సీ కవితను ఈడీ నాలుగో రోజు విచారించింది. ఇవాళ ఆమె పీఏలు రాజేశ్, రోహిత్‌లను కూడా విచారించినట్లు సమాచారం. కవిత అరెస్టు సమయంలో పీఏల ఫోన్లను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. వారి సమక్షంలోనే ఫోన్‌లను లాక్ తీయించి అందులోని సమాచారం ఆధారంగా ఈడీ ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఇక రాత్రి 7గంటల సమయంలో కవితను మాజీ మంత్రి కేటీఆర్, లాయర్ మోహిత్ కలిశారు. ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం.

Similar News

News July 8, 2024

పేటీఎం షేర్లలో 9% వృద్ధి!

image

సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పేటీఎంకు ఈరోజు ట్రేడింగ్‌లో సూచీలు ఊరటనిచ్చాయి. గరిష్ఠంగా 9.87% వృద్ధిని నమోదు చేసిన ఆ సంస్థ షేర్లు ప్రస్తుతం 8.11% ప్రాఫిట్‌తో ₹472 వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత ఆ సంస్థ షేర్లు ₹310-440 మధ్య కొనసాగుతున్నాయి. తాజాగా ₹36 వృద్ధి చెంది ₹500 మార్క్‌కు చేరువ అవుతుండటంతో ఇన్వెస్టర్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 8, 2024

శ్మశానంలో సమాధులకు సినిమాలు

image

థాయ్‌లాండ్‌లోని ఓ శ్మశానవాటికలో సమాధుల వద్ద కుర్చీలు వేసి సినిమాలు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. నఖోన్ రాట్చాసిమా ప్రావిన్స్‌లోని ఓ శ్మశానవాటికలో సినిమాలు వేశారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. JUNE 2-6 మధ్య ఇది జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా పూర్వీకుల ఆత్మల శాంతి కోసమే ఈ ప్రయత్నమని వారు చెబుతున్నారు. అదే దేశంలో ఇటీవల ఓ వ్యక్తి చనిపోయిన తన ప్రేయసిని వివాహం చేసుకోవడం గమనార్హం.

News July 8, 2024

కూటమిలో ఉన్నా ప్రజాసమస్యలు లేవనెత్తుతాం: పురందీశ్వరి

image

AP: కూటమిలో ఉన్నా ప్రజాసమస్యలను లేవనెత్తుతామని రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందీశ్వరి అన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. మరోవైపు NDA పదేళ్ల పాలనలో దేశంలో అద్భుత ప్రగతి ఉందన్నారు. వికసిత్ భారత్, ఆత్మనిర్బర్ భారత్‌కు ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు.