News March 20, 2024

ఫోన్ల లాక్ తీయించి ప్రశ్నలు!

image

TG: ఎమ్మెల్సీ కవితను ఈడీ నాలుగో రోజు విచారించింది. ఇవాళ ఆమె పీఏలు రాజేశ్, రోహిత్‌లను కూడా విచారించినట్లు సమాచారం. కవిత అరెస్టు సమయంలో పీఏల ఫోన్లను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. వారి సమక్షంలోనే ఫోన్‌లను లాక్ తీయించి అందులోని సమాచారం ఆధారంగా ఈడీ ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఇక రాత్రి 7గంటల సమయంలో కవితను మాజీ మంత్రి కేటీఆర్, లాయర్ మోహిత్ కలిశారు. ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం.

Similar News

News April 11, 2026

అన్నింటా ఉన్నవాడే ‘వేంకటేశ్వరుడు’

image

సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః|
అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః||
దేవతలకు అధిపతి, మనందరికీ శరణమిచ్చేవాడు, సహనశీలుడు, విశ్వానికి బీజము, జీవుల సృష్టికి కారణము వేంకటేశ్వరుడే. దినం, సంవత్సరం, సర్పం కూడా ఆయనే. విశ్వాసానికి మూలంగా, సమస్తాన్ని చూడగలిగే సర్వదర్శనుడిగా ఆయన సృష్టి, కాలం, రక్షణ, జ్ఞాన రూపాలలో అన్నింటా ఉంటాడు. అయన దర్శనం ముక్తికి మార్గం.

News April 11, 2026

వెనక్కి తగ్గిన నువాన్ తుషార

image

IPLలో ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు NOC ఇవ్వట్లేదని కోర్టుకెక్కిన నువాన్ తుషార వెనకడుగు వేశారు. కేసును వెనక్కి తీసుకోవడంతో పాటు బోర్డుకు సారీ చెప్పారు. గవర్నింగ్ బాడీని ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని మెయిల్ పంపారు. బోర్డు తన పట్ల పారదర్శకంగా వ్యవహరించలేదని, న్యాయం కోసం అలా చేశానని పేర్కొన్నారు. SL బోర్డు NOC ఇవ్వకపోవడంతో RCBకి ప్రాతినిధ్యం వహించాల్సిన తుషార ఇంకా జట్టులో జాయిన్ కాలేదు.

News April 11, 2026

భారతీయుల ఇళ్లలో ₹462 లక్షల కోట్ల బంగారం!

image

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారం నిల్వలు టాప్-10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వలను మించిపోయాయని అసోచామ్ వెల్లడించింది. మన ఇళ్లలో ఉన్న పసిడి విలువ సుమారు ₹462.25 లక్షల కోట్లని అంచనా. ఇందులో 2% నిధులు ఆర్థిక వ్యవస్థలోకి చేరినా దేశాభివృద్ధి వేగవంతమవుతుందని నివేదిక పేర్కొంది. 2025 నవంబర్ నాటికి గోల్డ్ లోన్ల విలువ ₹24.34 లక్షల కోట్లకు చేరింది. ఈ సంపదను ఉత్పాదక రంగంలోకి మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు.