News October 24, 2024

ముసుగు తొలిగిపోయింది: YCP

image

AP: జగన్, షర్మిలకు నెలకొన్న ఆస్తి వివాదంపై TDP<<14435746>> ట్వీట్<<>> చేయడంపై YCP స్పందించింది. ‘ముసుగు తొలగిపోయింది. పక్క పార్టీ నేతల వ్యక్తిగత విషయాలను TDP అఫీషియల్ హ్యాండిల్స్‌లో పెట్టినప్పుడే మీరంతా ఒకటేనని స్పష్టమైంది. అనుబంధాల గురించి CBN మాట్లాడటం విడ్డూరం. తన ఆస్తుల్లో తోబుట్టువులకు CBN ఎంతిచ్చారు? NTRకు వెన్నుపోటు పొడవలేదా? హరికృష్ణను, తనతో పాటు హెరిటేజ్ పెట్టిన నటుడ్ని గెంటేయలేదా?’ అని నిలదీసింది.

Similar News

News October 24, 2024

ఈవినింగ్ టైం బీటెక్.. గుడ్‌న్యూస్ చెప్పిన JNTUH

image

TG: పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల్లో పని చేస్తున్న వారికి JNTUH గుడ్ న్యూస్ చెప్పింది. సాయంత్రం వేళ బీటెక్ చదువుకోవాలి అనుకునే వారికి JNTUHతో పాటు మరో 8 కాలేజీలకు అనుమతిచ్చింది. త్వరలో స్పాట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. కోర్సు కాలపరిమితి మూడేళ్లు కాగా ఒక్కో విభాగంలో 30 సీట్లు ఉంటాయి. పని చేస్తున్న సంస్థ కాలేజీకి 75km పరిధిలో ఉండాలి. ఏడాది పని అనుభవం తప్పనిసరి.

News October 24, 2024

బాస్మతియేతర బియ్యంపై ఎంఈపీ తొలగింపు

image

బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను ప్రోత్సహించేందుకు గాను గతంలో నిర్దేశించిన కనీస ఎగుమతి ధరను కేంద్రం తొలగించింది. గత నెలలో ఈ బియ్యం ఎగుమతులపై ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. టన్నుకు 490 డాలర్ల కనీస ఎగుమతి ధరను(MEP) నిర్ణయించింది. తాజాగా దానిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా దేశంలో ఈ బియ్యం నిల్వలు పరిమితంగా ఉండటంతో గతేడాది జులై 20న వీటి ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

News October 24, 2024

అందుకే షర్మిలపై జగన్ పిటిషన్: YCP

image

AP: ఆస్తుల విషయంలో చెల్లికి మంచి చేయబోయి జగన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని YCP తెలిపింది. ‘సరస్వతి పవర్ విషయంలో లీగల్ సమస్యలున్నాయి. కేసులు తేలాక ఆస్తులు ఇస్తానని MoU రాసిచ్చారు. కానీ చట్ట విరుద్ధంగా <<14429978>>షేర్లు <<>>బదిలీ చేయడమే సమస్యకు కారణమైంది. ఇది జగన్ బెయిల్ రద్దుకు పరిస్థితులు సృష్టించడం కాదా? గత్యంతరం లేక లీగల్‌ స్టెప్‌ తీసుకున్నారు. జగన్ పదేళ్లలో రూ.200Cr షర్మిలకు ఇచ్చారు’ అని తెలిపింది.