News October 26, 2024
UNSC: పాక్‌ను మళ్లీ ఉతికారేసిన భారత్
UNSCలో పాక్‌ను భారత్ మరోసారి ఉతికారేసింది. కీలక డిబేట్‌లో కశ్మీర్లో మహిళల అంశాన్ని లేవనెత్తడంపై సీరియస్ అయింది. ఇది వారి అబద్ధాల వ్యాప్తి వ్యూహం ఆధారంగా చేపట్టిన రెచ్చగొట్టే చర్యగా వర్ణించింది. ‘పాక్ సంబంధం లేని పొలిటికల్ ప్రాపగండాకు దిగింది. మీ దేశంలో హిందువులు, సిక్కులు, క్రైస్తవులు సహా మైనారిటీ మహిళల దుస్థితేంటో అందరికీ తెలుసు’ అని UNలో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ పర్వతనేని హరీశ్ అన్నారు.
Similar News
News November 5, 2024
వారికి జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
AP: దేవాలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనం పెంచుతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రూ.50 వేల ఆదాయం దాటిన ఆలయాల్లో పనిచేసేవారికి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. పూజారులకు రూ.15వేల జీతం ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. మొత్తంగా 3,203 మంది అర్చకులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
News November 5, 2024
జగన్.. ఐదేళ్లలో నువ్వేం చేశావ్?: మంత్రి అనిత
AP: ఇప్పుడు లా&ఆర్డర్ గురించి మాట్లాడుతున్న జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏం చేశారని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు వైసీపీ పాపాలే కారణమన్నారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆమె పాల్గొన్నారు. వాస్తవాలను కాకుండా జగన్ సైకో బ్యాచ్ సోషల్ మీడియాలో తమపై బురదజల్లుతూ, జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు.
News November 5, 2024
ట్రంప్ గెలిస్తే నిజంగానే ‘పెద్ద’న్న అవుతారు!
అమెరికా ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అధిక వయస్కుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలువనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ వయసు 81 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం ఆయన ప్రమాణస్వీకారం చేసిన నాటి వయసుతో పోల్చితే ట్రంప్ వయసు ఐదు నెలలు అధికం. ఈ లెక్కన ట్రంప్ గెలిస్తే అధ్యక్షుడిగా ప్రమాణం చేసే పెద్ద వయస్కుడిగా (78 ఏళ్ల నాలుగు నెలలు) చరిత్ర సృష్టిస్తారు.