News November 20, 2024

UNSC 1945లో ఉండిపోయింది: భారత్

image

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి(UNSC) మారుతున్న కాలంతో పాటు ముందుకెళ్లడం మరచిపోయిందని భారత్ విమర్శించింది. ప్రగతి విషయంలో అత్యంత నెమ్మదిగా వ్యవహరిస్తోందని పేర్కొంది. ‘UNSC ప్రస్తుత పనితీరు 1945 నాటిదే. నేటి వాస్తవికతకు ఏమాత్రం దగ్గరగా లేదు. సహాయంలో UN అద్భుతమే. కానీ ఉద్రిక్తతల్ని కంట్రోల్ చేయడంలో మాత్రం విఫలమవుతోంది. సంస్థలో సంస్కరణలు అత్యవసరం’ అని UNలో భారత రాయబారి పర్వతనేని హరీశ్ వ్యాఖ్యానించారు.

Similar News

News November 20, 2024

P MARQ, మాట్రిజ్ సర్వే: మహారాష్ట్రలో మహాయుతి!

image

మహారాష్ట్రలో మహాయుతి అత్యధిక సీట్లు గెలుస్తుందని పీమార్క్ సర్వే అంచనా వేసింది. మహాయుతికి 137-157 సీట్లు వస్తాయని తెలిపింది. ఎంవీయేకు 126-146 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో మహాయుతికి దెబ్బపడిందని పేర్కొంది. మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ సైతం మహాయుతికే అనుకూలంగా ఉన్నాయి. బీజేపీ కూటమికి 150-170 వరకు సీట్లు వస్తాయంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంవీయేకు 110-130 రావొచ్చని పేర్కొంది.

News November 20, 2024

ABP సర్వే: బీజేపీదే అధికారం

image

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమిదే అధికారమని ఏబీపీ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో 288 సీట్లకుగాను బీజేపీ+శివసేన+ఎన్సీపీ 150-170, కాంగ్రెస్+ NCP SP+ SS UBT 110-130 సీట్లు, ఇతరులు 08-10 సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది. బీజేపీ 89-101 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. కాంగ్రెస్ 39-47, శివసేన 37-45, NCP(SP) 35-43, శివసేన(UBT) 21-29, ఎన్సీపీ 17-26 సీట్లు గెలవొచ్చని పేర్కొంది.

News November 20, 2024

EXIT POLLS: ఝార్ఖండ్‌లో బీజేపీదే పీఠం

image

ఝార్ఖండ్‌లో బీజేపీ అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో అంచనా వేసింది. మొత్తం 81 స్థానాలున్న ఈ రాష్ట్రంలో బీజేపీ 42-48 సీట్లతో స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న JMM 16-23 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. INC 8-14, AJSU 2-5, ఇతరులు 6-10 స్థానాలు గెలుచుకుంటారని వెల్లడించింది.