News November 20, 2024

UNSC 1945లో ఉండిపోయింది: భారత్

image

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి(UNSC) మారుతున్న కాలంతో పాటు ముందుకెళ్లడం మరచిపోయిందని భారత్ విమర్శించింది. ప్రగతి విషయంలో అత్యంత నెమ్మదిగా వ్యవహరిస్తోందని పేర్కొంది. ‘UNSC ప్రస్తుత పనితీరు 1945 నాటిదే. నేటి వాస్తవికతకు ఏమాత్రం దగ్గరగా లేదు. సహాయంలో UN అద్భుతమే. కానీ ఉద్రిక్తతల్ని కంట్రోల్ చేయడంలో మాత్రం విఫలమవుతోంది. సంస్థలో సంస్కరణలు అత్యవసరం’ అని UNలో భారత రాయబారి పర్వతనేని హరీశ్ వ్యాఖ్యానించారు.

Similar News

News December 3, 2024

7 IPOలకు సెబీ గ్రీన్ సిగ్నల్.. విలువ రూ.12,000 కోట్లు

image

మరో ఏడు కంపెనీల IPOలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఈకామ్, స్మార్ట్‌వర్క్ కోవర్కింగ్ స్పేసెస్, ట్రూఆల్ట్, జెమాలాజికల్, కెరారో, కాంకర్డ్, వెంటివ్ హాస్పిటాలిటీ ఉన్నాయి. IPOల ద్వారా సంస్థలు దాదాపు రూ.12,000 కోట్లు సమీకరించనున్నాయి. జెమాలాజికల్ అత్యధికంగా రూ.4వేల కోట్లు సమీకరించనుంది. మరోవైపు 2025లో జెప్టో పబ్లిక్ ఇష్యూకు వీలున్నట్లు కంపెనీ కో ఫౌండర్ ఆదిత్ పాలిచా వెల్లడించారు.

News December 3, 2024

పాగల్ ‘ఫెంగల్’.. 1,500kmల ప్రభావం

image

ఫెంగల్ తుఫాను భిన్న రూపాల్లో ముప్పుతిప్పలు పెట్టింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి ఓసారి బలహీనపడుతూ, కొన్ని గంటలకే బలపడుతూ పుదుచ్చేరి వద్ద తీరం దాటింది. దాని ప్రభావం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి మీద మాత్రమే కాకుండా 1,500km దూరంలోని ఒడిశాపైనా చూపింది. 5 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీని తీవ్రత ఇవాళ సాయంత్రం నుంచి తగ్గుముఖం పడుతుందని IMD వెల్లడించింది.

News December 3, 2024

కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, కరాటే, వాలీబాల్, షూటింగ్ సహా 27 విభాగాల్లో జాతీయ/అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం లేదా విజయం సాధించిన వారు అర్హులు. 18-23 ఏళ్లలోపు వయసున్న టెన్త్ పాసైన వారు DEC 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ.21,709-69,100 జీతం చెల్లిస్తారు. వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.