News December 31, 2024

IPLలో UNSOLD.. చరిత్ర సృష్టించాడు!

image

IPL-2025 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్నారు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో ముంబై బ్యాటర్ ఆయుశ్ మాత్రే 117 బంతుల్లో 181 రన్స్ చేశారు. లిస్ట్-A క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 150 రన్స్ బాదిన అతిపిన్న వయస్కుడిగా(17y 168d) నిలిచారు. ఇప్పటివరకూ ఈ రికార్డు జైస్వాల్ (17y 291d) పేరిట ఉండేది. మరోవైపు IPL ఆక్షన్‌లో అమ్ముడుపోని మయాంక్ అగర్వాల్ సైతం ఈ టోర్నీలో వరుసగా 3 సెంచరీలు చేశారు.

Similar News

News September 18, 2025

3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

image

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.

News September 18, 2025

శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.

News September 18, 2025

ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 35 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/BE ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.177. SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.