News December 31, 2024
IPLలో UNSOLD.. చరిత్ర సృష్టించాడు!
IPL-2025 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్నారు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో ముంబై బ్యాటర్ ఆయుశ్ మాత్రే 117 బంతుల్లో 181 రన్స్ చేశారు. లిస్ట్-A క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 150 రన్స్ బాదిన అతిపిన్న వయస్కుడిగా(17y 168d) నిలిచారు. ఇప్పటివరకూ ఈ రికార్డు జైస్వాల్ (17y 291d) పేరిట ఉండేది. మరోవైపు IPL ఆక్షన్‌లో అమ్ముడుపోని మయాంక్ అగర్వాల్ సైతం ఈ టోర్నీలో వరుసగా 3 సెంచరీలు చేశారు.
Similar News
News January 16, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) స్కీమ్ కింద ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించే వెసులుబాటును కేంద్రం కల్పించింది. తేజస్, వందే భారత్, హంసఫర్ వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ప్రయాణ సమయంలో వేతనంతో కూడిన సెలవుతో పాటు టికెట్ ఖర్చులకు రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.
News January 16, 2025
‘ముక్కనుమ’ గురించి తెలుసా?
సంక్రాంతి వేడుకలు చాలా చోట్ల మూడు రోజులే చేసుకున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం నాలుగో రోజు కూడా నిర్వహిస్తారు. దీనినే ముక్కనుమ అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఊర్లోని గ్రామదేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కనుమ రోజున మాంసం తినని వారు ఈ రోజున భుజిస్తారు. ఈ పండుగను ఎక్కువగా తమిళనాడులో నిర్వహించుకుంటారు. తమిళులు దీనిని కరినాళ్ అని పిలుస్తారు.
*ముక్కనుమ శుభాకాంక్షలు
News January 16, 2025
పౌరులకు మానవతా సాయం అందించండి: యూఎన్ చీఫ్
ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు UN చీఫ్ అంటోనీ గుటెర్రస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేసిన ఈజిఫ్టు, ఖతార్, యూఎస్ఏను ఆయన అభినందించారు. బాధిత పౌరులకు అవసరమైన మానవతా సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఎదురయ్యే సవాళ్లను తెలుసుకొని సాధ్యమయ్యే ప్రతిదీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని యూకే ప్రధాని స్టార్మర్ స్వాగతించారు.